భావజాలం లేని రాజకీయం..
అస్థిర రాజకీయాలకు పునాది
ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలి "ప్రజలకు సేవ చేయడానికి అధికారం ఒక మార్గం కానీ అది లక్ష్యం కాకూడదు". కానీ తెలుగు రాజకీయ పార్టీలే కాదు భారతీయ రాజకీయ పార్టీలు అధికారమే పరమావధిగా పని చేస్తున్నాయి. భావ సారూప్యత లేని రాజకీయాలు అస్థిరత రాజకీయాలకు పునాది.
"చర్చికి ధారాళంగా నిధులిచ్చి మతోన్మాదాన్ని ప్రోత్సహించారు. బతిస్తా ప్రసంగాలన్నీ అభివృద్ధి, దేశభక్తి, ప్రజాస్వామ్యం లాంటి మాటలతో పొంగిపొర్లుతున్నాయి. క్యూబా జాతీయోద్యమానికి ఆద్యుడైన హౌస్ మార్తి' పేరు బతిస్తా నాలుక చివరనే వుంటోంది. ఇలాంటి కల్లిబొల్లి కబుర్లు ఎన్ని చెప్పినా ప్రజల మీద సాగుతున్న దోపిడీ, అణిచివేతలు నగ్నంగా కనబడుతూనే వున్నాయి."
దీని ద్వారా స్పష్టమయ్యే విషయం ఏమిటంటే చే గేవేరా భావజాలాన్ని అవకాశవాదనికి వాడుకొని ఆయన్ని అవమానించారు ఈ భావసారూప్యత లేని పార్టీలు అని నా దృఢ అభిప్రాయం.
- పిటి పార్కర్
0 comments:
Post a Comment