Saturday 5 October 2019

కొంతమంది కుర్రవాళ్లు

ఈ మధ్యే సోషల్ మీడియాలో రిజర్వేషన్ల అంశం పై హాల్చల్ చేస్తున్న ఒక మెసేజ్ చూశాను. అది ప్రతిభను చంపేస్తూందని దాని సారాంశం. దాని క్రింద విజ్ఞాన ప్రపంచం అసలు రిజర్వేషన్ ఎందుకు పెట్టవలసి వచ్చిందని తెలియని మూర్ఖులు ఒక టీనా దాభిని బూచిగా చూపించి దళితులు రిజర్వేషన్ల వల్ల ఇప్పటికే చాలా లాభం పొందారని అర్థం లేని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల పై వారి అక్కసును నీరుగార్చు ప్రయత్నం నా ఈ కవిత్వం.

నా ప్రియ కవియని #శ్రీశ్రీ గారి "కొంతమంది కుర్రవాళ్లు" అను ఆయన సుప్రసిద్ధ కవిత్వ బాణీలో...


కొంతమంది కుర్రవాళ్లు


కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో దళితులు
పకీర్లకు పూజార్లకు వీరు అయ్యారట అస్పృశ్యులు
పరాదేశులైన ఈ ఆర్యులు
పిండి తాగారట వీరి రక్త మాంసాలు
వాడు వేసే పిండాకూడుకు శ్రమించారు రేయిపగలు

అదే దళితవాడలో పుట్టిన ఓ మాన్యూలు (అంబేడ్కర్)
భరించలేక వీరి పాపాలు
చదివాడయ్య వివిధ పుస్తకాలు
దులిపాడయ్య చెద పట్టిన చరిత్ర పూటాలు
పునరుద్ధరించాడయ్య రిజర్వేషనులు

మరి కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో అగ్రకులపోళ్లు
పేర్లకు, పుకార్లకు నిబద్ధులు
బామ్మ గారి భావాలకు బాసులు
కుల మదంతో బలిసాయాట వీరి ఒళ్ళు
కండకావరం కొవ్యెకాయట వీరి కళ్లు

అదే అగ్రహారాల్లో పుట్టిన ఈ కుహన మేధావులు
భరించలేక దళితుల పురోగమనాలు
మొదలెట్టారు అరకొర రిజర్వేషన్ల పై ఏడ్పులు
పరిపాటిగా వల్లె వేసారట పుక్కిటి పురాణాలు

రెండు వేల ఏళ్ల రిజర్వేషనులు పొందిన ఈ అమాత్యులు
ప్రతిభ క్షీణిస్తూందని పెడుతున్నారు గగ్గోలు!!!
రెండు వేల ఏళ్లు ప్రతిభ సాధించారు ఈ వీరులు
పతివ్రతలను నిప్పుల్లో తోసే ఆచారములు
నాపరాళ్లను పూజించే పద్ధతులు
వ్యభిచారము చట్టబద్ధం చేసిన న్యాయశాస్త్రాలు
అబ్బ! ప్రపంచంలో పుటలు ఉండవు మిగులు
రాస్తే వీరి జిత్తులమారి ప్రతిభలు!!!

- Pity Parker 


Share:

0 comments:

Post a Comment