అధివాస్తవికత (సర్రియలిజం)

అధివాస్తవికత (సర్రియలిజం)

వెళ్ళాలని ఉంది

అందమైన ఆనంతంలోకి

అంధకారమని వదిలేసిన అరణ్యంలోనికి

వెళ్ళి గంధపు చెక్కలా గుభాళించాలని ఉంది

 

దూకాలని ఉంది

పోటీలు పెట్టని ప్రపంచంలోకి

ఎండినదని ఎగతాళి చేసే ఏడారిలోకి

వాన చుక్కనై దూకి చిగురించాలని ఉంది

 

పారాలని ఉంది

అబ్బురపరిచే జలపాతంలా

కధల్ని మార్చే కలంలోనికి

సిరా చుక్కనై సాయుధ సంగ్రామం చేయాలని ఉంది

 

దూసుకుపోవాలని ఉంది

కులాల కుళ్ళు పెంచే కోటలోనికి

గొప్పదని గర్వానికి పోయే గదిలోనికి

ఉలకలా దూసుకుపోయి విధ్వంసం అవ్వాలని ఉంది

 

ఎగరాలని ఉంది

పావురం వలే స్వచ్ఛమైన స్వాతంత్య్రంలోకి

ఉరిమే మబ్బులకు ఊసులు చెప్పే ఊరికి

ఎగిరి మెరావాలని ఉంది

నింగిలో ఒక తారనై... ఆకాశంలో ధరణినై...

 

- పిటి పార్కర్ 

Post a Comment

0 Comments