బొమ్మలాట
అదొక అందమైన పురాతన కోట
అప్పుడప్పుడు కుర్రాళ్ళు వచ్చి ఫోటోలు దిగుతుంటారు
తిరునాళ్ళు, జాతరలు జరుగుతుంటాయి
అందమైన బొమ్మలకు ఈ తిరునాళ్ళు ప్రసిద్ధి
ఇనేళ్లుగా లేనిది కోటను సుందరంగా అలంకరించారు
బయట సంతలో ఏమీ అమ్మట్లేదు
బయటంతా పందిరి వేశారు నీడ కోసం
రంగు రంగుల పూలతో అలంకరించారు
"బంగారు బొమ్మ రావేమీ" అని రాగాలు వినిపిస్తున్నాయి
ఏమిటో చూద్దామని లోపలికి వెళ్ళా
అబ్బో! పెద్ద ఎవ్వారమే…
పెద్ద బొమ్మను కొన్నట్టున్నారు
చాలా అందంగా అలంకరించారు
కాకపోతే బొమ్మ తల కిందకి వంచి ఉంది
ఆతురతలో "ఎంతకు కొన్నారేంటి?" అని అడిగా
అందరూ ఎగాదిగా చూశారు
వాళ్ళను కొనడమేంటి... వాళ్ళే కొనుక్కున్నారు
బొమ్మ మనిషిని కొనుక్కోవడం ఎంటో నాకు అర్ధం కాలేదు
సర్లే వారంటీ ఎంత ఇచ్చారేంటి అని అడిగా
అంతా పైవాడి దయ అని పెద్దాయన అన్నాడు
ఇదేం బొమ్మలాటో!
0 Comments