సైరా నరసింహ రెడ్డి అనునది అరుపా? ఆర్తనాదమా? ఆవేదనా?

సైరా నరసింహ రెడ్డి అనునది అరుపా? ఆర్తనాదమా? ఆవేదనా?

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితాన్ని కథాంశంగా తీసుకొని విడుదలైన సైరా నరసింహ రెడ్డి అను చలనచిత్రం బుడ్డ రీలు నిన్ననే చూశాను... నిజంగా నాకూ రోమాలు నిక్కబొడుచూకున్నాయి... అది ఆయన త్యాగానికి కాదు... సంగీతం చేసే మాయాజాలం వల్ల ఆ అనుభూతి.
జనాలు ముఖ్యంగా యువత ఆ చిత్రాన్ని చూసిన తరువాతసైరా నరసింహ రెడ్డి గొప్ప వీరుడని తెగ పొగుడుతూంటే ఆంధ్రా చరిత్ర కొద్దోగొప్పో చదివిన నాకు నవ్వు ఆపు కోవడం వల్ల కాలేదు.

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి ఒక పాలెగార్ల కుటుంబములో పుట్టాడు. పాలెగార్ల వ్యవస్థ ఒక రకంగా 15,16 శతాబ్దంలలో భూస్వామ్య వ్యవస్థ అనే చెప్పుకోవచ్చు. వీరి పని కష్టపడి పండించిన రైతుకు, పంటకు, నిర్వాసితుల భూమికి శిస్తు వసూలు చేసి రాజు గారి కి ఇచ్చే పాలేగార్లు. వీరు వసూలు చేసిన శిస్తు లో 1/4 సొమ్మును అతని అవసరానికి ఉంచుకుని.... మిగతా వి రాజుకు ఇవ్వవలసి ఉంటుంది. వీరు ఆ ప్రాంత అవసరాలు అనగా సైన్యం, సౌకర్యాలు చూసుకోవాలి.


క్రమేపి వీరు ఆ కొంత భూ భాగానికి ఒక సామంతరాజులులా తయారయ్యారు. మధుర నాయకర్లు పతనమైన పిదప బ్రిటిషు ప్రభుత్వం వల్ల వీరి ప్రాబల్యం తగ్గింది. చమట చిందించకుండా ఇప్పటి వరకు విర్రవీగిన ఈ పాలెగార్ల తమ శిస్తులు ఆవాహాయామీ!! అని ముందే యెరిగి బ్రిటిషు ప్రభుత్వం పై దండెతారు అంతే గాని అఖండ భారత దేశాన్ని వలస వాద విముక్తి నుండి కాదు. ఒక భూస్వామి తన ఆస్తిని కాపాడుకోవడానికి చేసిన చిన్న ప్రయత్నం ఈ చిత్రం. అంతే కాని ఆయన పోరాటయోధుడు కాదు. భూస్వాములు వలస వాదుల పోరాటంలో సామాన్యు నికి ఒరిగిందేమిలేదు... రక్తము తో తడిసిన నేల తప్ప

కాబట్టి అది ఒక భూస్వామి తన శిస్తు ను కోల్పోయిన బాధలో అరిచిన అరుపు తప్ప... విరోచితం ముమ్మాటికి కాదు
ఐనా ఒక భూస్వామి (ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గారు) ఆవేదన మరొక భూస్వామికే (చిరంజీవి గారు) అర్థమవుతోంది. అందుకే ఒక పుక్కిటి పురాణం చెప్పడానికి 300 కోట్ల సెట్టింగ్!!!
- పిటి పార్కర్

Post a Comment

0 Comments