Wednesday, 15 January 2020

HUM DEKHENGE in Telugu| Fayiz Ahmad Fayiz | మేము చూస్తాము


మేము చూస్తాము
ప్రఖ్యాత కవి ఫాయిజ్ అహ్మద్ ఫాయిజ్ ఉర్దూ నజమ్ "హమ్ దేకేంగే" అనువాదం



బీజెపీ ప్రభుత్వ వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ వల్ల నిరసనలు దేశంలో నిరసనలు మిన్నంటాయి. ఆ శాంతియుత నిరసనలలో ప్రఖ్యాత కవి ఫాయిజ్ మొహమ్మద్ ఫాయిజ్ నజమ్ "హమ్ దేకేంగే" అను ఈ గీతం ప్రతిధ్వనించింది. అలాగే ఈ రచనను ఒక పాకీస్తానీ రచన కావడం వల్ల వివాదానికి కూడా కేంద్రబిందువయ్యింది. నిరంకుశ సంకెళ్ళలో బందీయైన ప్రజలు.. ప్రజాతంత్ర, ప్రజాస్వామ్య విలువలకై వేచి చూస్తున్న ప్రజల అనుభవిస్తున్న  ఆత్మఘోషను వివరిస్తూనే భవిష్యత్తులో సమసమాజ రాజ్య స్థాపన జరుగుతుందని ఆశావాదాన్ని కవి ఈ నజమ్ లో లిఖించారు. ఆ నజమ్ తెలుగు అనువాదం మీ కోసం...


<<< మేము చూస్తాము... >>>

మేము చూస్తాము
మేము చూస్తాము
నిశ్చయముగా కళ్లారా చూస్తాము

లిఖించబడిన గణతంత్రమును
వాగ్ధానము చేయబడిన రోజును
మేము చూస్తాము
నిశ్చయముగా కళ్లారా చూస్తాము

నిరంకుశత్వము, వివక్షను మొండిదిబ్బలు
నురగగా మారి అవిరౌ రోజును
అట్టడుగున పరిపాలింపబడు మా కొరకు
భూమాత గుండెచప్పుడు ప్రతిధ్వనించు రోజును
నిరంకుశల పై గగనము గర్జించు సమయమున
మూర్ఖుల మకుటాలు మాయమౌ రోజును
మేము చూస్తాము
నిశ్చయముగా కళ్లారా చూస్తాము

దేవదేవతలు నివసించు ఈ స్థలమున
బానిస సంకెళ్లు పెకిలించబడును
నిరంకుశత్వము నుండి రక్షింపబడిన
సమసమాజము రాజ్యాధికారము చేపట్టు రోజును
మకుటాలు మశానమౌ రోజును
ప్రౌఢ పీఠాలు పెకలింపబడు రోజును
మేము చూస్తాము
నిశ్చయముగా కళ్లారా చూస్తాము

ఉత్తమ నామము నిలచిపోవును
దృశ్యాదృశ్యమగు దేవదేవుని ఉత్తమ నామము
వీక్షించి రక్షించు సర్వోన్నతుని దివ్య నామము
ప్రతిధ్వనించును 'నేను దేవుణ్ణి' అను స్వరము
సత్యమను ఒక మందహసము వినబడును
నేను నువ్వు సమానమను రాజ్యము
దేవుని ప్రజలే దేవుని రాజ్యమును ఏలుదురు
నేను నువ్వు సమానమనే రాజ్యమును
మేము చూస్తాము
నిశ్చయముగా కళ్లారా చూస్తాము

రచయిత 
ఫాయిజ్ అహ్మద్ ఫాయిజ్
అనువాదం: పిటి పార్కర్










  
Share:

0 comments:

Post a Comment