Tuesday, 12 May 2020

కదులుతున్న జయ భారతం


కదులుతున్న  జయ భారతం



కదులుతోంది జయ భారతం
కంటి నిండా కన్నీళ్లను పంటి కింద బిగబట్టుకొని
బతుకు భారాన్ని బొంతల్లో మూటగట్టుకొని
మూతగట్టిన భారాన్ని నెత్తినెట్టుకొని
గుండెల్లో శోఖాన్ని తట్టుకొని

కదులుతోంది ప్రియ భారతం
చంకలో చంటి బిడ్డనేసుకొని
పాల కోసం ఏడుస్తున్న పాపని
రొమ్మునకు అదిమి పెట్టుకొని
మనసులో బాధను దాచి పెట్టుకొని

నడుస్తోంది యువ భారతం
విరిగిన చెప్పులకు దారాలు కట్టుకొని
జానెడు పొట్టను చేతబట్టుకొని
ఆకలి మంటలు తట్టుకొని
ఎర్రటి ఎండను ఓర్చుకొని

నడచి నడచి ఆగారు
ఆగి ఆగి నడిచారు
అలసట ఇంధనమయ్యింది
ఆశ పరుగయ్యింది
పొలిమేర పోషించట్లేదు
తీరం దయ చూపట్లేదు

కదులుతోంది జయ భారతం
కదులుతోంది ప్రియ భారతం
నడుస్తోంది యువ భారతం

రచన – పిటి పార్కర్

Also Read other poems

My pen/ నా కలము



Share:

0 comments:

Post a Comment