Wednesday, 1 July 2020

‘మగత’నం - తెలుగు కధ

‘మగత’నం

    స్కూలు విడిచిపెట్టి గంట కూడా అయ్యుండదు. కిట్టూ స్నేహితులతో స్కూల్ యూనిఫాం తీయకుండానే సందు చివర నున్న ఖాళీ స్థలంలో ఆడటం మొదలెట్టారు. కిట్టునే దానికి గ్యాంగ్ లీడర్. ఆట మొదలవ్వగానే ' ఫస్ట్ బ్యాటింగ్' అనే విషయం పై గొడవలే అవుతాయి కానీ కిట్టూ ఎది చెప్తే అదే ఫైనల్. హాఫ్ హాండ్స్ యూనిఫామ్ షర్టును ఏదో కండలు చూపించాలనట్టు నూనూగు మీసాల కిట్టూ మడత పెడుతూ "ఏంట్రా కమల్ గాడు ఇంకా రాలేదా?" అని అరిచేస్తున్నాడు.

అప్పుడే వేసవి సెలవులు ముగిసి, స్కూల్ తెరిచి ఒక వారం అయ్యి వుంటదేమో కాబోలు. అప్పుడప్పుడే వాతావరణం వేడి తగ్గుతుంది. వీధి వీధంతా కిట్టూ అండ్ గ్యాంగ్ కుర్రాళ్ల అరుపులతో సందడిగా ఉంది. వీధిలో ఏ హడావుడైన వీళ్ళు చేయాల్సిందే అది గణేష్ విగ్రహం చందా పోగు చేయడం కానీ, ఊరేగింపులో డాన్సులు గాని కిట్టూ అతని స్నేహితులే ముందుండేవారు. కిట్టూ అంటే తెలియని వారుండరు ఆ వీధిలో ఉండరేమో!

కిట్టూ ఆడుకునే ఆ ఖాళీ స్థలానికి ఎదురుగానే పండు వాళ్ళ ఇల్లు. కిట్టూ ఆ ఇంట్లో తాము ఉంటే బాగుండు అనుకునేవాడు ఎందుకంటే తొందరగా ఆటకి రావచ్చు, ఆట నుండి వెళ్ళొచ్చు అని! ఉన్నటుండి వాతావరణం చల్లబడింది. తొందరగా పొద్దుపోతుండటంతో బ్యాటింగ్ అవకాశం రాని వారు తరువాత నేనంటే నేనని గొడవపడుతున్నారు.

***

పద్మ వేడి, వేడి టీ కాస్తుంది. పండు అమ్మ ఎప్పుడు టీ గిన్నెలో పొస్తుందా అని తెరిచిన కిటికీ నుండి కిట్టూ గ్యాంగ్ వాళ్ళ కేకలను చూసి, విని ఏమీ పట్టనట్టు ఆ నాప రాతి నేల మీద కూర్చోని చేతిలో పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ తో టీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో అమ్మ టీ గిన్నె పండు ముందు పెట్టింది. పండుకి ఇద్దరు అక్కలు. వారు కూడా అక్కడే కూర్చోని ముచ్చటిస్తున్నారు. పండు స్కూల్లో జరిగిన విషయాలన్నీ అక్కలతో రోజూ ఇలాగే చెప్తు ఉంటాడు.  ఆ మాటల సందడిలో వేడి టీలో అప్పటికే ఒక బిస్కట్ దూకి ఆత్మహత్య చేసుకుంటే మరో బిస్కట్ ను పండు రంగలోకి దించి పైకి తీసే దీర్ఘ ప్రయత్నంలో ఉన్నాడు పండు.

ప్రచురణకు మిగతా కధ తీసివేయబడింది. 

చదవాలనుకునేవారు షడ్రుచులు పుస్తకంలో కధ కొనసాగించవచ్చును. 


ఆర్డర్ లింకు - Order Shadruchulu now

Share:

0 comments:

Post a Comment