ఖాన్ల, కపూర్ల, భట్ ల హత్య

ఖాన్ల, కపూర్ల, భట్ ల హత్య

#సుశాంత్_సింగ్   #కంగనా_రనౌత్   #ఆయుష్మాన్ఖు_రానా #ఉదయ_కిరణ్

         కొనేళ్ల క్రితం రావూరి భరద్వాజ్ గారికి జ్ఞాన్ పీఠ అవార్డు తెచ్చిన పాకుడురాళ్లు నవల చదివినప్పుడు సినీరంగంలో ఆడవాళ్ళ పరిస్థితి ఇంత దయనీయంగా ఉండేదాఅని అనుకున్నా. కానీ తరువాత శ్రీ రెడ్డి, చిన్మయి శ్రీ పాద... నిన్నటి శ్రీ సుధ కథలు విన్నప్పుడు ఉండేదా అన్న అప్పటి ప్రశ్న ఉంటుందాఅయ్యింది. కానీ ఆడవాళ్ళు ధైర్యంగా బయటకొచ్చినప్పుడు సమాజం చూపించే కాఠిన్యం మీకు నేను చెప్పనవసరం లేదు.

అప్పటి ఉదయ కిరణ్ ఆత్మహత్య తెలుగు పరిశ్రమలో ఉన్న ఆధిపత్య ధోరణి బట్టబయలైంది. ఏదో కొన్ని రోజులు అయ్యో పాపం అనుకున్నాం... తరువాత ఊరుకున్నాం. మొన్నటి  సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో ఈ విషయం మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఇది జాతీయంగా చర్చకు దారితీసింది. ఖాన్లుకపూర్లు చేసిన నిర్వాకం అని ప్రజలు తేల్చేశారు. 

అయినా కూడా ఇంకా కపూర్లూఖాన్లూభట్లూ "అబ్బే! అలాంటిదేమీ ఉండదు. ఆయనది మానసిక రోగం" అని మీడియా గొట్టాల ముందుట్విట్టర్లో కూతలు పెడుతున్నారు. కొన్ని గొఱ్ఱెలమంద వీటిని వెనకేసుకురావడం మామూలే!

నటి కంగనా రనౌత్  ఈ ఆధిపత్యం గురించి ఒక వీడియో బైట్ విడుదల తరువాత చర్చ ఇంకా విస్తరించింది. కొంతమంది ధైర్యంగా చెప్పడం కూడా జరిగింది.

నేను హిందీ సినిమాలు పెద్దగా చూడను గానీ  అయుష్మాన్ ఖూరానా సినిమాలు ఇష్టం. ఆయన సినిమాల్లో ఉండే సామాజిక కోణం వాళ్ళ. ఆర్టికల్ 15 గానీ శుబ్ మంగళ్ జ్యాదా సావదాన్ లాంటి సినిమాలతో ఇంకా నచ్చేశాడు. ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా స్త్రీ సాధికారత కోసం చేసే వ్యాఖ్యలుఅతని భార్య పట్ల వ్యవరించిన విధం చాలా మందికి ఉదాహరణగా నిలిచాడు. ఇలాంటి వ్యక్తిని సినిమా రంగంలో చూడటం ఇదే మొదటిసారి అనిపించింది. 

ఈ మధ్య ఆయన బాలీవుడ్ లోకి ఎలా వచ్చాడో ఆయన ప్రయాణాన్ని "క్రాకింగ్ ద కోడ్" అనే పుస్తకం తిరగేశా... ఎటువంటి ఆధారం లేకుండా మంచి స్థాయికి ఎదిగిన నటుడైన వాళ్ళలో ఈయన ఒకడు. మరి ఆయన ఈ ఆధిపత్యం అనుభవించా అని చదివా.

అతను బిగ్ ఎఫ్ఎం లో 47 సెలబ్రిటీలను ఇంటర్వ్యు అవకాశం వచ్చింది ఆ సెలబ్రిటీల్లో  కరణ్ జోహార్ ఒకరు. ఈ సందర్భం చదివితే సినిమాల్లో ఆధిపత్య ధోరణి చక్కగా తెలిసిపోతుంది. అందుకే ఆ కొంత విషయాన్ని తెలుగులో మీ కోసం 

అదృష్టం కలిగి ఉన్నందునబూత్‌కు వచ్చిన చాలా మంది ప్రముఖులలో కరణ్ జోహార్ కూడా ఉన్నారు. ఇంటర్వ్యూ మధ్యనేను నటుడిగా మారాలనే కోరికను వ్యక్తం చేశాను మరియు అతని ఫోన్ నంబర్ కోసం అడిగాను.

అతను ఆశ్చర్యంగా:
నిజంగానా వ్యక్తిగత నంబర్‌ను మరియు అది కూడా రేడియోలో దేశం అంతా వింటుండగా మీకు ఇస్తారని మీరు ఎలా ఆశిస్తున్నారు!

"ఇంటర్వ్యు తరువాత" అని చెప్పగా ఇంటర్వ్యూ ముగింపులోఅతను నాకు తన ఆఫీసు ల్యాండ్‌లైన్ నంబర్ ఇచ్చాడు.
నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను మరియు అబ్ తో లైఫ్ సెట్ హై. అబ్ ముజే కోయి రోక్ నహిన్ శక్తి! ధర్మ ప్రొడక్షన్స్ చేత ఆయుష్మాన్ ఖుర్రానా ని పరిచయం! 

మరుసటి రోజు నేను కరణ్ నాకు ఇచ్చిన నంబర్‌ను డయల్ చేసాను. కరణ్కార్యాలయంలో లేరని వారు చెప్పారు. ఆ మరుసటి రోజునేను మళ్ళీ మరలా కాల్ చేసా మరియు వారు బిజీగా ఉన్నారని వారు చెప్పారు. చివరకునా గుండె బద్దలయ్యే విషయంతరువాతి రోజువారు నాతో నిర్మొహమాటంగా చెప్పారు, ‘మేము స్టార్లతో మాత్రమే పని చేస్తాము మరియు మీతో పని చేయలేము.

అనుభవించిన వారే చెప్తున్నప్పుడు ఈ ఫ్యాన్స్ గొడవెంటో మధ్యలో...
నిజానిజాలు తెలుసుకొని మానవత్వంతో మాట్లాడటం నేర్చుకుందాం!

బాధితుల పక్షాన నిలబడదాం!

భాధ్యుల పక్షాన కాదు!!!

ఆయుష్మాన్ ఖురానా "క్రాకింగ్ ది కోడ్" కవర్ పేజీ



ఆయుష్మాన్ ఖురానా "క్రాకింగ్ ది కోడ్" పుస్తకంలోని పేజీ

Post a Comment

0 Comments