"Culture is not frozen in time" అనే వ్యాఖ్య ఇక్కడ మనము తెలుకోవాల్సిన విషయం. మతమేదైనా మత్తు మందు వంటిదే అని మర్క్స్ ఏనాడో చెప్పారు. పైన చెప్పిన విధంగా మన సంస్కృతి పుట్టినప్పటి నుండి ఒక దగ్గర నిలిచిపోదు. కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది. రోలు, రోకలు మిక్సీ అయ్యింది. మిక్సీ మరలా గ్రైండర్ అయ్యింది. కాదు కూడదు అని మనం రోలు, రోకలి వద్ద ఆగలేదు. ఇదే ప్రతీ మతానికి వర్తిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయా ఆచారాలను సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే అది అహేతుకతను ప్రబలంగా ప్రజల్లోకి చొప్పించడం వలన మన బుర్రలు మరగుజ్జు అవ్వడం కాయం.
ఈ విషయాన్నే "Trance" అను ఈ సినిమా అద్భుతంగా చూపించగలిగింది. క్రైస్తవ మతంలో సంస్కరణలు కచ్చితంగా రావాలని కోరుకుంది. అద్భుతాలు, స్వస్థతలు పేరు మీద జరుగుతున్న మోసాలను ఈ సినిమా చూపించగలిగింది. ఒక హేతువాది, అనువుగాని పరిస్థితులలో ఈ మతం పేరు మీద వ్యాపారం నడిపే వారి చెరలో పడి పాస్టర్ అవ్వడం జరుగుతుంది. పాస్టర్ పేరు మీద ఆయన చేస్తున్న మోసాలను, నాటకాలను చూపించడం జరుగుతుంది.
నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో బైబిల్ లో చెప్పినట్టు "అబద్ధ ప్రవక్తలు ఉన్నారు జాగ్రత్త...వారు గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు" అనే బైబిల్ వ్యాఖ్యను ఊతంగా తీసుకుని మూఢత్వాన్ని ప్రశ్నించారు. స్వస్థత అంటే కాళ్ళు లేని వాళ్లకు కాళ్ళు, క్యాన్సర్ తగ్గిపోవటం కాదు...చెడు అంతమవ్వడం. అదే స్వస్థత. ఈ విషయం మిరాకిల్ ఫెస్టివల్ లో పాస్టర్ స్వస్థత కోసం నటిస్తుండగా అవరచన్ అనే పాత్రకు పక్షవాతం రావడం అనే విషయం ద్వారా అర్ధమవ్వుతుంది.
ఇక్కడ నేను ఈ సినిమా రివ్యూ చేయదలచుకోలేదు గానీ ఒక విషయం స్పష్టం చేయదలిచాను. ఇక్కడ మనం ఈ సినిమాలో గుర్తిచవలసిన ముఖ్య విషయం ఏమిటంటే... ఇది మతం యొక్క అస్థిత్వాన్ని ప్రశ్నించలేదు గాని మతంలోని మూఢ ఆచారాలను ప్రశ్నించి, ప్రేక్షకులకు ప్రశ్నలు రేకెత్తించింది.
స్వస్థత ప్రార్ధనలు పేరు మీద జరుగుతున్న వ్యాపారం మీదనే ఈ సినిమా మొత్తం కొనసాగింది. ఆ మూడాచారాల్ని సమాజానికి చూపించింది. ఇటువంటి గొప్ప సందేశాత్మక సినిమా అందరూ ముఖ్యంగా క్రైస్తవులు హేతువాద దృక్పధంతో చూడండి.
ఈ సినిమా చూసిన కొందరు ఇతర మతోన్మాదులు, ఈ మతం ఇది, అది అని పెదార్ధాలు తీసి కొత్త వివాదానికి తెర తీయొద్దు. ప్రతీ మతంలో ఇటువంటి మూఢచారాలు ఉన్నాయి. సంస్కరణలు రావాల్సిన అవసరం కచ్చితంగా ఉంది.
సినిమా అయితే చూడడం మర్చిపోకండి!
అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు...
#పిటి_పార్కర్
The sad reality
ReplyDelete