1955లో ప్రఖ్యాత బీబీసీ రేడియోలో
అంబేద్కర్ ఇంటర్వ్యూ
©All Copyrights belong to BBC
ముఖ్యాంశాలు:
·
గాంధీని నేను ఒక
ప్రత్యర్ధి స్థాయిలో కలిసాను గనుక అందరికంటే నాకే ఆయన గురించి ఎక్కువ తెలుసు.
·
నా ముందు ఆయన కోరలు
బయటపెట్టాడు గనుక ఆయనలో దాగియున్న మరో మనిషిని చూడగలిగాను
·
గాంధీ ఎప్పుడో భారతీయుల మనస్సులో నుండి చెరిగిపోయాడు.కాకపోతే...
·
ఆయన ఎప్పుడూ రెండు నాల్కల ధోరణి ప్రదర్శించేవాడు.
·
మొత్తానికీ ఆయన అదొక్కటే కోరుకున్నారు...
·
ఆయన ఎప్పటికీ సంస్కరణవాది కానే కాదు.
·
స్వాతంత్ర్యం దశలవారీగా జరిగుంటే భారత దేశం ఇంకా ఎక్కువ లాభాపడేదని నా
అభిప్రాయం.
·
ఒక ఫ్రెంచ్ దేశపు మహిళ .... విషయంలో గాంధీతో వాదులాడారు.
·
షెడ్యుల్డ్ కులాల వారు ముస్లిములు, సిక్కుల వలే స్వతంత్రంగా బలంగా అవుతారనే
భయం ఆయనలో ఉంది.
·
నైతికంగా ఆయన ఆ
బిరుదుకు అర్హుడు కాదు.
“మహాత్మా – దురాత్మా”?
కొన్నేళ్ళ క్రితం CNN IBN అను ప్రముఖ ఇంగ్లీషు వార్తల ఛానల్
వారు ‘మహాత్ముని తరువాత
గొప్ప భారతీయుడు ఎవరు?’ అని ఒక ఆన్లైన్ పోల్ నిర్వహించారు. ఆ ఆన్లైన్ పోల్లో డా|| బాబా సాహెబ్
అంబేద్కర్ గారిని ప్రజలు తమ ఆన్లైన్ ఓట్లతో ఎన్నుకున్నారు అని ఒక కార్యక్రమం ఘనంగా
నిర్వహించారు. ఇది చాల ఆనందమైన విషయం. కానీ నాకు ఒక సందేహం వచ్చింది. “గాంధీ తరువాత?” అని ఎందుకు నిర్వహించారు అని.
అంటే గాంధీ గారిని దేశమంతా గొప్ప భారతీయుడుగా అభివర్ణించినట్టేనా? బహుశా చిన్ననాటి
నుండి మన పాఠ్య పుస్తకాలు గాంధీ గారిని గురించి మరీ అతిశయోక్తిగా అభివర్ణించారేమో అని
ఆయన జీవిత కథలను పరిశీలిస్తే అర్ధమవుతుంది. అంబేద్కర్ గారిని చదివిన తరువాత ఇంకా
కూలంకషంగా అర్ధమవుతుంది. పాటయ పుస్తకాలన్నీ గాంధీ గారి శాంతి వచనాలతో నింపే మన
విద్య వ్యవస్థ మన అభివృద్ధికి అడ్డుగోడగా నిలిచిన అంబేద్కర్ గారు చెప్పిన కుల
నిర్మూలన పై ఒక హేతువాద దృక్పదం ఏర్పరచాదు . ఇదేయే కాక గాంధీ గారి పేరు పై అంశాలకు
అంశాలు ఉంటె అంబేద్కర్ గారి ప్రస్తావన కామాల(,) మధ్యలో లేక మొదలగునవి ముందు ఉంటాయి.
లేకపోతే మహా అయితే కష్టంగా ఒక 10 వాక్యాలు ఉంటాయేమో. కానీ మహాత్మా అని మనం పిలిచే
గాంధీ గారి కనికట్టు కథలు పుంఖాను పుంఖాలుగా ఉంటాయి. పుస్తకాలన్నీ గాంధీ గారిని
రైలు నుండి తోసేసారు. అక్కడే ఉద్యమ స్ఫూర్తి మొదలయ్యింది అని చాల కధలు చెప్పుకుంటూ
వచ్చారు కాని అసలు విషయం ఎవరూ చెప్పారు. సౌత్ ఆఫ్రికాలో నల్ల జాతీయులను అంటరాని
వారని మరియు వారు నడిచే ద్వారంలో మేము నడిస్తే మలినమయ్యిపోతామనే ఆయన చేసిన పోరాటాన్ని
ఎ పాఠ్య పుస్తకం మాట్లాడదు.
ఈ చారిత్రిక భ్రమలను
సౌత్ ఆఫ్రికాకు చెందిన అశ్విన్
దేశాయి మరియు గోళం వాహెద్ అను విద్యావేత్తలు గాంధీస్ ‘లైఫ్ అండ్ హిస్ వర్క్ ఇన్ సౌత్
అఫ్రికా’ లో చారిత్రాత్మక ఆధారాలతో బట్టబయలు చేసారు. ఈ మధ్యే ఈ విషయాన్ని తెలుసుకుంటున్న
ఆఫ్రికా ప్రజలు ఘనా యూనివర్సిటీలో గాంధీ విగ్రహాన్ని తొలగించారట*. ఆఫ్రికానే కాదు
భారతదేశం విషయంలో కూడా అంటరాని కులాలపై గాంధీ గారి స్వభావం అటువంటిదే అని అరుంధతి
రాయ్ గారు “కుల నిర్మూలన” పుస్తకానికి అందించిన “డాక్టర్ అండ్ సెయింట్” అనే విశ్లేషణ చూస్తే
అర్ధమవుతుంది. దానికంటే ముఖ్యంగా గాంధీ గారి విరోధియైన డా||అంబేద్కర్ గారు గాంధీ
గారి గురించి చెప్పిన బీబీసి వారి ఇంటర్వ్యూ పెద్ద కనువిప్పునే కలుగజేసింది. ఇంకా
గాంధీ పై మూఢ భక్తి ప్రదర్శించి ఆయనేదో శాంతి కాముకుడు అని చెప్పే మాటలన్నీ వట్టి
నీటి మూటలని అంబేద్కర్ గారి మాటలను చూస్తే అర్ధమవుతుంది. ప్రపంచానికి గాంధీ గారి
స్వభావం తెలియజేసిన ఇంటర్వ్యూ తెలుగులో ఎక్కడా నాకు అగుపడలేదు. కనుక ఈ 129వ డా||
బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ ఇంటర్వ్యూని తెలుగులోకి
అనువదించి మీ ముందుకు తెస్తున్నాను....
CNN IBNలో ప్రసారమైన GREATEST INDIAN AFTER GANDHI ఎపిసోడ్
ఇంటర్వ్యూ:
1929లో ఆయనకు
నాకు పరస్పర మిత్రుడైన ఒకని చొరవతో గాంధీ నన్ను చూడాలని నాకు లేఖ రాసారు. అప్పుడే
ఆయన్ను మొదటిసారి కలవడం. ఆ సంఘటన “రౌండ్ టేబుల్ సమావేశానికి” కొన్ని రోజుల ముందే.
కానీ ఆయన మొదటి సమావేశానికి హాజరు కాలేదు. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి
వచ్చినప్పుడు ఇక్కడే ఆరైదు నెలలు ఉన్నారు. అప్పుడే ఆయన్ను ముఖాముఖిగా చూడడం. ఆ
తరువాత మరలా నన్ను ఓసారి కలువమని లేఖ పంపారు. పూణా ఒడంబడిక జరిగిన తరువాత ఆయన్ను
కలువడానికి వెళ్ళాను. అప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. నేనెప్పుడూ నా మిత్రులకు
చెప్తుంటాను... గాంధీని నేను ఒక ప్రత్యర్ధి స్థాయిలో కలిసాను గనుక అందరికంటే నాకే
ఆయన గురించి ఎక్కువ తెలుసు. నా ముందు ఆయన కోరలు బయటపెట్టాడు గనుక ఆయన దాగియున్న
మరో మనిషిని చూడగలిగాను అని నా భావన. ఆయన భక్తులు, అనునాయులు ఆయన బాహ్య
వ్యక్తిత్వం చూసి మహాత్ముడని ఒక నిర్ణయానికి వచ్చేసారు. నేను ఆయనను సాధారణ మనిషిగా
చూస్తున్నా గనుక ఆయనలో ఉన్న మరో మనిషిని
ఆయన అనునాయుల కంటే ఎక్కువగా ఆవిష్కరించానని అనుకుంటున్నా.
గాంధీ
గారిని మీ పరిశీలనలు బట్టి క్లుప్తంగా మీరు ఆయనను ఎలా విశ్లేషిస్తారు?
మొదటగా నన్ను అబ్బురపరిచే విషయం ఏమిటంటే... గాంధీ గురించి
బయట ప్రపంచం ముఖ్యంగా పశ్చిమ దేశాలు ఎందుకింత ఉత్సుకత ప్రదర్శిస్తుందో నాకు అర్ధం
కావట్లేదు. భారతీయులకు సంబంధించి, నా ఆలోచన
మేరకు, భారత దేశ చరిత్రలో ఒక ఉపాఖ్యానమే
గాని ఎప్పటికీ ఉగాపురుషుడు కానే కాదు. గాంధీ ఎప్పుడో భారతీయుల మనస్సులో నుండి
చెరిగిపోయాడు. కాంగ్రెస్ పార్టీ ప్రతీ సంవత్సరం ఆయన జయంతి లేక ఆయన జీవితానికి
సంబంధించిన రోజుల నాడు వేడుకలు నిర్వహించి ఆయన్ను గుర్తు చేయడానికి శతవిధాల
ప్రయత్నిస్తుంది. గాంధీకి ఈ కృత్రిమ ఊపిరి ఇవ్వడం వలనే ఇంకా బతికున్నాడు లేకపోతే
ప్రజలు ఆయన్ను ఎప్పుడో మరిచిపోయేవారు.
గాంధీ గారు సమూలమైన మార్పులు తీసుకొచ్చారని మీరు
భావిస్తున్నారా?
కానే కాదు. ఆయన ఎప్పుడూ రెండు
నాల్కల ధోరణి ప్రదర్శించేవాడు. ఆయన రెండు పత్రికలు నిర్వహించేవారు: ఒకటి “హరిజన్”
అనే ఆంగ్ల పత్రిక మరియు “దీనబంధు” అనే గుజరాతి పత్రిక. ఓసారి ఆ రెండు పత్రికలను
పరిశీలిస్తే మీకర్ధమవుతుంది ఆయన ప్రజలను ఎంతగా మోసం చేస్తున్నాడో. ఆంగ్ల పత్రికలో
ఆయన కుల వ్యవస్థకు ప్రత్యర్ధిగా మరియు అంటరానితనం వ్యతిరేకించు ఒక
ప్రజాస్వామ్యవాదిగా ప్రపంచానికి ఆయన్ను చిత్రీకరించుకుంటాడు. కానీ, గుజరాతీ పత్రిక
తిరగేస్తే ఆయనెంత సనాతనవాదో మీకర్ధమవుతుంది. తరతరాలుగా దేశాన్ని పీడిస్తూ వస్తున్న
కుల వ్యవస్థను, వర్ణాశ్రమ ధర్మాన్ని మరియు ఇతరత్రా సనాతన మూ మూ మూఢ ఆచారాలను మద్దతిస్తూ
వచ్చాడు. ఎవరైనా ఆయన ఆంగ్ల పత్రికలు మరియు గుజరాతీ పత్రికలలో(ఏడు సంపుటాలు
ఉన్నాయి) ఆయన చేసిన వ్యాఖ్యలను తులనాత్మకంగా పరిశీలిస్తే కూలంకషంగా అర్ధమవుతుంది. ప్రపంచ
ప్రజలు ముఖ్యంగా పశ్చిమ దేశాల వారి మనస్సులో స్థానం సంపాదించడం కోసం ప్రజాస్వామ్యం
నమ్మే ప్రజాస్వమ్యవాదులైన మీకు ఆ పాఠాల్ని భోదిస్తాడు. మీరు వ్యవహారిక భాషా పత్రికలలో ఆయన ఎం రాసారో
తెలుసుకోవలిసింది. విచిత్రమేమిటంటే ఎవరికీ దానిపై అవగాహన లేదు. అందుకే ఆయన జీవిత
కధలన్నీ ఆంగ్ల పత్రికల ఆధారంగా రాసారు గానీ గుజరాతీ పత్రికల ఆధారంగా కాదు.
షెడ్యుల్డ్ కులాల పట్ల గాంధీ గారి అసలైన వైఖరి ఏమిటంటారు ?
మా జాతులకు రెండే రెండు అవసరము:
మొదటిది అంటరానితనాన్ని నిర్మూలించడం. రెండవ అతి ముఖ్యమైనది మా కులాలకు ఇతర
కులాలతో పాటు సమాన అవకాశాలు ఇవ్వాలి. సమాన
అవకాశాలు లేకుండా అంటరానితనం నిర్మూలించడం వలన ఎటువంటి లాభం ఉండదు. రెండు వేల
ఏళ్లుగా మేము అంతరానితం మోస్తుంటే మమ్మల్ని పట్టించుకున్న ప్రభుద్దుడే లేదు. ఈ అంటారానితనంలో
సంఘ వైకల్యాలు ఎన్నో ఉన్నాయి. ఓ మచ్చు తునకగా, అంటరాని ప్రజలు పెద్ద కులాల
మడుగుల్లోనుండి నీళ్ళను తోడుకోలేరు. నీటిని ఎలా సృష్టించుకోవాలో నేను
నేర్చుకున్నాను. ఈ రోజు అన్నిటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే షెడ్యుల్డ్ కులాల
వారు ఇతర కులాలతో పాటు సమాన స్థాయిలో ఉండాలి. మాకు కూడా ఉన్నత కార్యాలయాల్లో కొలువులు కల్పిస్తే మా గౌరవమే కాదు సమాజంలో మా సాంఘీక పరిస్థితి మెరుగయ్యి
మమ్మల్ని మేము రక్షించుకునే స్థితిలో మేము ఉంటాము. వీటన్నిటికీ గాంధీ వ్యతిరేకం.
మరి ఆయన దళితులకు ఆలయాల్లో ప్రవేశం లేకపోవడాన్ని
ధిక్కరించారుగా...?
మొత్తానికీ ఆయన అదొక్కటే
కోరుకున్నారు. ఇప్పుడా హిందూ దేవాలయాల
ప్రవేశాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. అంటరాని కులాలకు ఆ ఆలయాల ప్రవేశం వల్ల
ఎటువంటి ప్రయోజనం ఉండదని అర్ధమయ్యింది. ఒకడు అంటరాని వాడలో నివసించేప్పుడు ఆలయ
ప్రవేశం ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏమీ లేదు. ఒకప్పుడు పెద్ద కులాలు
మలినమయ్యిపోతారని అంటరాని వారిని రైళ్ళలో ప్రయాణించడానికి అనుమతించేవారు కాదు.
ఇప్పుడు రైల్వే వారు దానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసేసారు. ఇప్పుడు వారితో
పాటు అంటరాని వారు రైళ్ళలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి పల్లెల్లో అంటరానితనం నిర్మూలన అయిపోదు. ఒకవేళ ఒక
హిందువుకు ఒక అంటరానివాడు రైల్వే స్టేషనులో ఎదురైనప్పుడు, ఆ హిందువు మళ్ళీ ఆ పాత
మూడాచారాలనే పాటిస్తాడు.
మీరు గాంధీ గారిని ఒక సనాతన హిందువని భావిస్తున్నారా?
ఖచ్చితంగా గాంధీ సనాతన హిందువే.
ఆయన ఎప్పటికీ సంస్కరణవాది కానే కాదు. ఆయనలో ఎటువంటి మార్పు లేదు. మొదటగా
అంటరానివారిని కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించడానికి అంటరానితనం నిర్మూలన గురించి
మాట్లాడతాడు. రెండవడిగా, ఆయన తలపెట్టిన స్వరాజ్య ఉద్యమాన్ని అంటరాని వారు విమర్శించకుండా
ఉండేందుకు ఇవన్ని
చేసారు. ఇది తప్ప అయనకు అంటరాని కులాలను ఉద్ధరించాలనే భావం అసలు లేనే లేదు. ఈయన
అమెరికాలో నీగ్రోల తరుపున పోరాడిన గారిస్సన్ లాంటి వారు కాదు.
భారతదేశం రాజకీయ
స్వాతంత్ర్యాన్ని గాంధీ లేకుండా సాధించేదంటారా?
ఓ ! ఖచ్చితంగా. గాంధీ లేకపోతే
భారతదేశం రాజకీయ స్వాతంత్ర్యం క్రమక్రమంగా సాధించేది. స్వాతంత్ర్యం దశలవారీగా
జరిగుంటే భారత దేశం ఇంకా ఎక్కువ లాభాపడేదని నా అభిప్రాయం. బ్రిటీషు వారి నుండి
భారత దేశానికి దశలవారీ అధికార మార్పిడి
జరిగినప్పుడు సాంఘీక వైకల్యాలతో బాధ పడుతున్న
ఒక్కో వర్గం బలపడుతూ వచ్చేది. ఈ అధికారమంతా ఒక ఉపద్రవంలా వచ్చేసరికి ప్రజలు
మార్పుకు సిద్ధంగా లేరు. ఇంగ్లాండులో ఉన్న లేబరు పార్టీ అత్యంత తెలివితక్కువదని అని నేను
అనుకుంటున్నాను.
బీబీసీ రేడియోలో ప్రసారమైన పూర్తి ఇంటర్వ్యూ ఆడియో
ఇంతకీ ఎవరు అసహనంగా ఉన్నారు? గాంధీనా లేక కాంగ్రెస్
పార్టీనా?
అట్లీ గారు స్వాతంత్ర్యానికి ఎలా
ఒప్పుకున్నారో ఇప్పటికీ నాకు తెలియదు. ఆ రహస్యానికి ఆయన ఆత్మ కథలో తెర తీస్తారేమో
చూద్దాం. అనూహ్యంగా ఇలా జరుగుద్దని ఎవరూ ఊహించలేదు. నా పరిశీలనలో రెండు విషయాలు
లేబరు పార్టీను ఈ నిర్ణయానికి తీసుకొచ్చాయి
మొదటిది, సుభాష్ చంద్రబోస్ గారు
నిర్మించిన నేషనల్ ఆర్మీ. దేశంలో ఎటువంటి మార్పులు జరిగినా, రాజకీయ నాయకులు ఏమి
చేసినా సైనికులకు బ్రిటీషు ప్రభుత్వం పట్ల విధేయత లేదా రాజభక్తి తొలగిపోదు అనే
స్థిర అభిప్రాయంలో బ్రిటీషు ప్రభుత్వం ఉండిపోయింది. ఆ గుడ్డి సూత్రాన్ని బ్రిటీషు ప్రభుత్వం
అనుసరించింది. ఆ సూత్రం పేకల మేడలా తునాతునకలైపోయిింిది. ఆవేశంలో ఉన్న సైనికులు
బ్రిటీషువారిని తరిమేస్తారని ప్రభుత్వానికి అర్ధమయ్యింది. దీన్ని బట్టి బ్రిటీషు
వారు సైనిక వ్యవస్థతో తప్ప ఇతర ఎ వ్యవస్థతోనూ భారత దేశాన్ని పరిపాలించలేము అని ఓ
నిర్ణయానికి వచ్చేసారు. 1857లో భారతీయ సైన్యం ఈస్ట్ ఇండియా కంపెనీ పై తిరుగుబాటులా
జరిగితే బ్రిటీషు ప్రభుత్వం సరిసమానమైన
యురోపియన్ దళాలు పోరాడలేవు అని తెలుసుకుంది.
నా ఉద్దేశం ప్రకారం బ్రిటీషు దళాలు
భారతీయ ఆర్మీను విరమింపజేసి వెంటనే పౌర
శాఖలో ఉద్యోగాలు కేటాయించాలనుకుంది. ఈ రద్దు చేసే క్రమంలో ప్రభుత్వం ఎంత
నైరాస్యానికి గురయ్యిందో మీకు తెలుసు. రద్దు చేయని ఉద్యోగాలు అలా పడున్నాయి. రద్దు
చేసి ఉద్యోగాలు కేటాయించిన వారు ఆ పౌర శాఖ ఉద్యోగాలు తీసుకునేందుకు సిద్ధంగా లేరు.
వాటి పరిస్థితి ఏమిటి? బ్రిటీషు వారికి
భారత దళాలను అణగదొక్కే మార్గమేమీ అగుపడలేదు కావచ్చు.
బ్రిటీషు వారు భారత దేశంలో పొందిన
గొప్ప లాభం ‘వాణిజ్యం’. పౌరుల ఉద్యోగాలు, సైనిక దళాల నిర్వహణ పెద్ద ఖర్చేమీ కాదు.
అది చాల చిన్న విషయం. వ్యాపారం మరియు వాణిజ్యం కొరకు త్యాగం చేసి ఉండొచ్చు. భారతదేశానికి స్వాతంత్ర్యం
ఇచ్చినా లేక స్వయం ప్రతిపత్తి హోదా లేదా అంతకంటే తక్కువ హోదా ఇచ్చినా వ్యాపారం
మరియు వాణిజ్యం ఇదే రీతిలో కొనసాగుతుంది. నాకు ఈ విషయం పై మాట్లాడే అధికారం లేదు
కాబట్టి నాకు తెలిసినంతవరకు ఈ విషయాలే లేబరు పార్టీ వైఖరిని మార్చి ఉండవచ్చు.
పూణా
ఒడంబడికకు సంబంధించి, గాంధీ మీకు చెప్పిన మాటలు మరియు మీరు గాంధీకి చెప్పిన మాటలు
గుర్తున్నాయా?
బ్రిటీషు వారు గొప్పగా విధించిన మెక్ డోనాల్డ్ గారు నా సూచనను
అంగీకరించారు. నేను చెప్పాను, హిందువులకు
మరియు షెడ్యుల్డ్ కులాలకు కలిపి సమాన ఓటర్ల జాబితా ఉంటే వేర్పాటువాద వైఖరి
ఉండదని వారన్నారు.
కానీ ఆ జాబితా ద్వారా ఎన్నికైన షెడ్యుల్డ్ కులాలకు వారు కూడా ఈ హిందువుల ప్రభావంతో వారి చేతుల్లో
కీలుబోమ్మల్లా, బానిసల్లా ఉంటారే గాని స్వతంత్రంగా ఉండలేరు. అప్పుడు నేను రామ్సే మెక్ డోనాల్డ్ గారికి ఒక
సూచన చేసాను. మాకు ప్రత్యేక ఓటర్ల జాబితా ఇవ్వమని దీనితో పాటు అదనంగా గాంధీ
అన్నట్టు వేర్పాటువాదం లేకుండా సాధారణ ఎన్నికల్లో అందరితో సమానంగా రెండవ ఓటు హక్కు
కల్పించమని అడిగాను.
నా ఉద్దేశం ఏమిటంటే; ఒక ఐదేళ్ళ వరకు హిందువులకు మాకు
సాంఘీకంగా లేదా ఆధ్యాత్మికంగా ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తాము. అందరితో పాటు
సాధారణ ఓటర్ల జాబితా వల్ల జరిగే ఒక్క రోజు ఎన్నికల వల్ల సంవత్సరాల తరబడి పెరిగిన
వేర్పాటువాదం మటుమాయమవుతుంది అనుకోవడం మూర్ఖత్వం. ఒక హిందువు, అంటరాని వాడు కలిసి
ఎన్నికల్లో పాల్గొంటే వారి భావాలు మరుతాయనుకోవడం నిజంగా మూర్ఖత్వమే. అసలు అలాగా జరుగదు. కాని గాంధీ ఈ విషయంలో విచిత్రంగా ప్రవర్తించాడు.
ఈ వ్యవస్థలో అంటరానివారికి రెండు ఓట్లు ఇవ్వండి. గాంధీ
విమర్శించకుండా జనాభాను బట్టి ప్రాతినిధ్యం ఇవ్వమని కోరాము. దీనితో ప్రాతినిధ్యం
ప్రతినిధులను బట్టి కాకుండా ప్రజలను బట్టి ఉంటుంది. మెక్
డోనాల్డ్ గారు ఈ సలహాను అంగీకరించారు. ఈ అవార్డు నా సలహా మేరకే. ఈ విషయాన్ని
మొత్తం నేపుల్స్ నుండి ఉత్తరంగా రాసాను. నేను అనుకునట్టే ఆయన సాధారణ ఎన్నికలకు
రెండు జాబితాలను విడుదల చేసారు. గాంధీకి
మా రెండు ప్రాతినిధ్యాలు నచ్చలేదు. వెనువెంటనే నావద్దకు వచ్చేసారు. బ్రిటీషు
ప్రభుత్వం ఇలా చెప్పింది...
ఆయన అవార్డును తిరస్కరిస్తే
మాకెటువంటి అభ్యంతరం లేదు. కాని మేమిచ్చిన అవార్డును మేము వెనక్కి తీసుకోలేము
“మేము ఒక అవార్డు ప్రకటించాము. మేము అన్ని విషయాలను పరిగణలోకి తీసుకునే ఈ
నిర్ణయానికి వచ్చాము. మాకు తెలిసినంత వరకు అదే శ్రేయస్కరము. మీరు మెక్ డోనాల్డ్ లేఖను
చదివి ఉండవలిసింది. నిజానికి అది నిర్మోహమాటమైన వ్యాఖ్య. “మాకు వైరము సృష్టించే
ఉద్దేశము లేదు. నిజానికి మేము రెండు వర్గాల ప్రజలను ఒక సాధారణ జాబితాలోకి
తీసుకురావాలని మా ప్రయత్నము. కాని గాంధీ అభ్యంతరం ఏమిటంటే మాకు స్వాతంత్ర్య
అభ్యంతరం ఉండొద్దని. కావున ఆయనకు “ఈ వర్గాల ప్రాతినిధ్యం వద్దు” అనే వాదనలోనే
ఉన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలోనూ ఆయన
వైఖరి ఇదే.
ఆయన ఆ సమావేశంలో హిందువులు,
ముస్లిములు మరియు సిక్కుల ప్రాతినిధ్యం మాత్రమే అంగీకరించారు. రాజ్యాంగబద్దంగా
కూడా ఈ మూడు వర్గాలకే రాజకీయ గుర్తింపు ఉండాలనేది ఆయన అభిప్రాయం. కానీ
క్రైస్తవులకు, ఆంగ్లో ఇండియాన్స్కు మరియు షెడ్యుల్డ్ కులాలకు రాజ్యాంగపరమైన చోటును
ఆయన వ్యతిరేకించాడు. ఆ వర్గాల వారు కూడా గుర్తింపబడిన వాటిల్లోనే చేరిపోవాలని
సూచించారు. ఇదే ఆయన వాదన. ఆయన ఆప్త మిత్రులే ఈ విషయంలో ఆయన్ను వాదించారు. నీవు
సాంఘీకంగా, రాజకీయంగా, ఆర్ధికంగా బలంగా ఉన్న ముస్లిములకు, సిక్కులకు ప్రాతినిధ్యం
అంగీకరిస్తే బలహీనవర్గాలైన క్రైస్తవులు, షెడ్యుల్డ్ కులాల వారికి ఎందుకు
వ్యతిరేకిస్తారు? ఈ ప్రశ్నకు మీకు మా బాధలు అర్ధం కావు అని సమాధానం ఇచ్చేసారు.
గాంధీ ఆప్త మిత్రుడైన అలెగ్జాండర్ కూడా ఈ విషయంలో గాంధీతో వాదులాడారు. ఆయన
శిష్యులైన ఒక ఫ్రెంచ్ దేశపు మహిళ (ఆమె పేరు నాకు గుర్తు లేదు) కూడా ఈ విషయంలో
గాంధీతో వాదులాడారు. అయితే ఎవరికీ వద్దని చెప్పండి లేదా సమానమైన దానికి
ఒప్పుకొండి. దాని మేము అర్ధం చేసుకుంటాం. అదే ప్రజాస్వామ్యం కూడా. కానీ
ముస్లిములకు, సిక్కులకు ఇచ్చి షెడ్యుల్డ్
కులాలకు వ్యతిరేకించడం అర్ధం లేనిది. ఈ ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం లేదు.
మేము ఈ సూచన చేసాము. మొదటగా
షెడ్యుల్డ్ కులాల ప్రాతినిధ్యం ఆయన అంగీకరించలేదు. ఆయన మిత్రులు ‘ఇది మరీ వెగటు వాదన. ఎవరూ దీనిని
సమర్దించరు’ అని చెప్పారట. అప్పుడే మాళవ్య
మరియు ఇతరుల “ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలరా?” అని నా వద్దకు వచ్చారు. మీ సమస్యకు
పరిష్కారం కోసం మాకు బ్రిటీషు ప్రధాని ఇచ్చిన అవార్డును మేము త్యాగం చేయదలచుకోలేదు
అని నేను చెప్పను. కాని ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చెప్పాను. మా ప్రత్యేక ఓటర్ల
జాబితాను త్యాగం చేయలేము కాని మరో విధంగా సవరించవచ్చు. అదేమిటంటే షెడ్యుల్డ్ కులాల
తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను షెడ్యుల్డ్ కులాల ప్రజలే ప్రాధమిక
ఎన్నికల్లో ఎన్నుకుంటారు. మొత్తంగా
షెడ్యుల్డ్ కులాల వారు నలుగురుని ఎన్నికల్లో అభ్యర్ధులుగా నిలబెడతారు. నిలబెట్టిన
వారిలో ఉత్తముడు గెలవవచ్చు. వారితో మా గోంతుకను పార్లమెంట్లో వినిపించవచ్చు. గాంధీ
దీనికి అంగీకరించారు. 1937లో జరిగిన ఆ ఒక్క ఎన్నికల్లోనే మాకు ఆ ప్రయోజనం ఉంది. ఆ ఎన్నికల్లో గాంధీ పార్టీ
నిలబెట్టిన ఎ అభ్యర్ధి ఎన్నిక కాలేదు.
ఆయన నిరాహార దీక్షలో మీతో ఆ విషయంలో బాగా బేరమాడారా?
ఆయన బెరమాడుతూనే ఉన్నారు. ఇలాంటివి
చెల్లవని చెప్పాను. మీరు మీ దృఢ అభిప్రాయలు మార్చుకోనంత వరకు నేను మీ ప్రాణాన్ని
కాపాడలేను. నా జాతి ప్రజల భవిష్యత్తును మీ జీవితం కోసం త్యాగం చేయలేను. ఇంతగా నేను
శ్రమించాను. మీ యుక్తిని సంతృప్తి
పరచడానికి నేను నా ప్రజల జీవితాన్ని తాకట్టు పెట్టలేను. ఒక సాధారణ ఎన్నిక ఈ
పరిస్థితిని ఎలా మార్చగలదు? నేను చేయలేను.
షెడ్యుల్డ్ కులాల వారు ముస్లిములు,
సిక్కుల వలే స్వతంత్రంగా బలంగా అవుతారనే భయం ఆయనలో ఉంది. అప్పుడు హిందువులు ఈ
సంఘర్షణను ఎదుర్కోవాలి. ఇదే ఆయన మనసులో ఉండేది. హిందువులను మిత్రపక్షాలు లేకుండా వదిలేయడం ఆయనకు ఇష్టం లేదు. ఆయన ఒక సాధారణ రాజకీయ నాయకుడు మాత్రమే. ఆయన మహాత్మ కానే కాదు. మహాత్మ అని
ఆయన్ను సంభోదించడం నేను వ్యతిరేకిస్తాను. నేనెప్పుడూ అలా సంభోదించలేదు కూడా.
నైతికంగా ఆయన ఆ బిరుదుకు అర్హుడు కాదు.
బీబీసీ సౌజన్యంతో...
అనువాదం
0 comments:
Post a Comment