షేక్స్పియర్ జయంతి మరియు వర్ధంతి సందర్భంగా(23 ఏప్రిల్)....


షేక్స్పియర్ జయంతి మరియు వర్ధంతి సందర్భంగా(23 ఏప్రిల్)....










"Whan that April with his showręs soote

The drought of March hath perced to the roots"

"వర్షపు జల్లుల మాసమైన ఏప్రిల్ మార్చి పొడి నేల పువ్వుల వేర్లు, రెమ్మలను తడపగా..." ఇంగ్లీషు భాషలోని మొట్టమొదటి వాక్యాలు ఇవి. ఈ వాక్యాలు జెఫ్రీ చాసర్ గారి ఇంగ్లీషు రచనైన "క్యాన్టర్బెరీ టేల్స్" ప్రారంభ వాక్యాలు. ఇంగ్లీషు సాహిత్య పితామహుడైన జెఫ్రీ చాసర్ గారు ఈ వాక్యాలతో జ్యోతిష్యం చెప్పదలచుకోలేదు కావచ్చు గాని ఆయన ఇంగ్లీషు భాషా భవిష్యత్తును ఊహించి ఉండొచ్చు.

1400 చాసర్ గారి మరణం తరువాత ఇంగ్లీషు భాషా అంధకారంలోకి వెళ్ళిపోయింది అంటారు సాహిత్య విమర్శకులు. చాసర్ మరణం తరువాత రచయితలు ఉన్నా వారి సాహిత్యం అంత ప్రభావం చూపలేదని చెప్పుకోవాలి. అందుకే చాసర్ మరణం నుండి ఇంగ్లీషు బాషా చరిత్రను AGE OF DARKNESS అంటే అంధకార యుగంగా అభివర్ణించారు. తరువాత ఏప్రిల్ నెల 23, 1556లో విలియమ్ షేక్స్పియర్ జననంతో అంధకారం తొలగుతుంది. చాసర్ గారు ఏప్రిల్ వర్షపు జల్లులు ఈ షేక్స్పియర్ గారేనేమో అని నాకనిపిస్తుంది.

స్ట్రాట్ ఫోర్డ్ ఒన్ ఏవోన్ అనే చిన్న పట్టణంలో పుట్టిన షేక్స్పియర్ యూనివర్సిటీ చదువు కూడా లేదు కానీ మార్లోవ్, థామస్ లోడ్జ్, థామస్ జాన్ లీలీ, జార్జ్ పీలీ వంటి యూనివర్సిటీ వక్తలకు ధీటుగా రచనలు చేసి గొప్పవాడనిపించుకున్నాడు. ఇప్పుడు ఈయన్ని చదవకుండా ప్రపంచంలో ఏ విద్యార్థి తన 10వ తరగతి పట్టా పొందలేడనే చెప్పుకోవాలి. దీనికి కారణం ఆయన ప్రపంచానికి అందించిన సాహిత్య సేవనే చెప్పుకోవాలి.

ఇంగ్లీషు భాష ఒకప్పుడు పేద వారి భాషగా ఉండేది. ఫ్రెంచ్, లాటిన్ భాషలను ఉన్నత వర్గాలు మాట్లాడుతుండేవి. కానీ, చాసర్, షేక్స్పియర్ ఇంకా ఎంతో మంది ఈ సాహిత్యాభివృద్ధి కోసం చేసిన కృషి అనే చెప్పుకోవాలి. ఇంగ్లీషు భాషలోని కొన్ని వందల పదాలు షేక్స్పియర్ గారే రూపొందించారంటే ఆయ సేవ యొక్క గొప్పతనం తెలిసిపోతుంది. పేదవారి భాషైన ఇంగ్లీషు ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తుంది అంటే అది వీరి శ్రమే!

కానీ ప్రస్తుత పరిస్థితులలో భాషాభిమానులు ఒక భాష పై ప్రేమ అంటే ఇతర భాషలపై ద్వేషం అనే స్థాయికి తీసుకెళ్లిపోయారు. నిజంగా చెప్పాలంటే ఒక భాష పై ప్రేమ ఇతర భాషలపై ఉన్న ఆప్యాయతను రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా మాతృభాషపై. షేక్స్పియర్ గురించి నేను తెలుగులో వ్యాసం రాయడం ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

షేక్స్పియర్ గారు ఒక సొన్నెట్ (పద్యంలో) తన ప్రియురాలిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ... తమ ప్రేమను శాశ్వతం చేసుకోవడానికి మార్గాలను చర్చించుకుంటారు. తమ ప్రేమ భౌతికం కాకూడదు. తాము చనిపోయినా తమ ప్రేమ శాశ్వతం కావాలి అని ఆలోచిస్తారు. చివరకు తమ ప్రేమను ఒక పద్య రూపంలో రాసి... మన ప్రేమ శాశ్వతం అయ్యింది అని చెప్తారు. మనం ఈ లోకాన్ని విడిచినా... ఈ వాక్యాలు ప్రజలు చదివిన ప్రతీసారీ తమ ప్రేమ చిగురించి, పరిమళిస్తుంది. మన ప్రేమ ఎప్పటికీ శాశ్వతం అవుతుంది అంటాడు. ఈ వాక్యాలను మనం ఇప్పుడు చర్చిస్తున్నాను అంటే వారి ప్రేమ ఇంకా పరిమళిస్తుంది అనే చెప్పుకోవాలి.

షేక్స్పియర్ గారు సాహిత్య విలువను ఈ చిన్న పద్యంలో అనంతమైన సందేశం అందించారు. సాహిత్యం ఎన్నటికీ చనిపోదు. నీవు చనిపోయినా నీ సాహిత్యం నిన్ను ఈ లోకంలో బ్రతికిస్తుంది అనే గొప్ప సందేశాన్ని ఎన్నో ఏళ్ల క్రితం మనకు అందించారు. ఈ సాంకేతిక పరిజ్ఞాన పరుగులతో నేటి యువత సాహిత్యాన్ని విస్మరిస్తున్నారు. తమ భావాలను రెండు వాక్యాలతో రాయలేని పరిస్థితులు నేటి విద్యార్థులున్నారు. ఇలాగే కొనసాగితే మరలా సాహిత్యం ఇంకో అంధకార యుగం చూడవలసి వస్తుంది. కాబట్టి నీవెందుకు షేక్స్పియర్ కాలేవు? ఆలోచించుకో?

నీ భాషను కాపాడుకో... నీవు దానికి పోరాటాలు చేయనవసరం లేదు... నీ భాషలో నీ భావాలు రాయి.

అదే సాహిత్య సేవ!

- పిటి పార్కర్

#SHAKESPEARE #ENGLISH_LITERATURE

Post a Comment

0 Comments