శీలం - శల్యం

శీలం - శల్యం


ఆడదాని నవ్వు వీళ్ళకి అరిష్టం
మగాడి ఏడ్పు వీళ్ళకి చేతగానితనం
ఇదేగా మీరు చెప్పే ఆచారం!

ప్యాంటుల వెనుక దాగుందట మగాడి పౌరుషం
వాడు పుట్టిన అంగం అయ్యిందట మహా పాపం
ఇదేగా మీరు నేర్పే ధర్మ శాస్త్రం!

అమ్మాయిని 'అంగ'డి బొమ్మ చేసెను చలనచిత్రం
మగాడి అహంకారం అయ్యింది వీళ్ళకి విరహగీతం
ఇదేగా మీరు నేర్పిస్తున్న యుగళ గీతం

ఆడవారి అణకువ మీరు నేర్పే వైదిక సూత్రం
మగవాడి విశృంఖలత్వం పెంపొందించిన తత్వం
ఇదేగా మీరు నేర్పించే సుప్రభాతం

ఈ శాస్త్రం, ఆచారం నేర్పేవే లింగభేదం
అదో పెద్ద విషవలయం
అవి కోరవు సమాజ హితం





Post a Comment

0 Comments