నరులకు మణినా కన్నీటి కథనాలు అచ్చుకేనా
అవి ఎరుగునా న్యాయం మచ్చుకైనా
నా కళలు ఇంకేది వంటగది గచ్చుకేనా
అవి ఎరుగునా కరతాళధ్వనులు ఈ తరమైనా
నా బ్రతుకు అంటుల మోతేనా
అది ఎరుగునా బుగ్గ కారుల కూత ఏనాటికైనా
నా చాతుర్యము కూరగాయల బేరాలకేనా
అది ఎరగదా చట్టసభల కర్మవాచకాన్ని
నా చదువులు పత్రికలు చడవడానికేనా
అవి ఎరుగునా కలం సిరాని ఇప్పటికైనా
నారీమణి, ధరించు కలానికి నీ గళం ఇప్పటికైనా
సంధించు విప్లవ తూటా స్వతంత్రం పొందేదాకా
పోరాడితే పోయేదేమిలేదు వనితా
నీ బానిస సంకెళ్లు తప్ప!!!
0 Comments