Sunday, 22 March 2020

సోయ లేని మీడియా - సరుకు లేని జనాలు

సోయ లేని మీడియా - సరుకు లేని జనాలు


వాట్సాప్ గ్రూపుల నిండా, ఫేస్ బుక్ గోడల నిండా, ఇన్స్టా కధల నిండా సొల్లు మాత్రమే దర్శనామిస్తున్నాయి... అభ్యుదయం, పరిజ్ఞానం, పరిపక్వత అసలు బొత్తిగా ఉండటం లేదు😓
అందుకే రాశా... కాదు రాయాల్సొచ్చింది


సోషల్ మీడియా నిండా...

ఆలి మగల సొల్లు కబుర్లు,
ఆడవాళ్ళపై పంచాయతీలు

కనికట్టు కధలు
కుళ్లు చమత్కారాలు,

అసత్య ప్రచారాలు,
అసందర్భ ప్రేలాపణలు,

విపరీత పోకడలు,
వింత పురాణాలు,

హేతుకం లేని హిస్టరీలు,
మెదడు లేని మిస్టరీలు

ఆవేశపూరిత ఆక్షేపణలు,
నైతికం లేని నిక్షేపణలు

మానవత్వం లేని వాదనలు,
నిరంకుశత్వంతో నిండిన ఉపన్యాసాలు

కళ్ళు మూసుకునే కాఠిన్యాలు
ముక్కున వేలేసుకునే విషయాలు

నిర్లక్ష్యంతో కూడిన అరుపులు
చావులు, చిందులు, చట్టుబండలు

ఏమిరా?
నీ వల్ల దేశానికి ఉపయోగం???

#పిటి_పార్కర్

#unfaithfully_yours



Share:

0 comments:

Post a Comment