సీఏఏ చట్టం – హిందూ రాష్ట్ర బీజం
లౌకిక భారత స్వరూపాన్ని
పాతాళానికి తొక్కి హిందూ మతోన్మాద సామ్రాజ్యం ఏర్పాటు దిశగా ఎప్పటినుండో తన
తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంఘ పరివార్ మరియు బీజేపీ శక్తుల
వేర్పాటువాదం రెండో సారి అధికార పీటమెక్కిన అధికార మదంతో భారత రాజ్యంగ పౌరసత్వ
సవరణతో దేశంలో మత చాంధసవాదం ప్రేరేపించడానికి సర్వశక్తులు ఒడ్డుతుంది.
హిందూ రాష్ట్ర బీజం
బీజేపీ అధికారపీటమేక్కిన
దగ్గర నుండి హిందువేతరులపై తన కాలకూట విషం చిమ్ముతూ వస్తుంది. ఘర్ వాపసీ నుండి
మొదలు పెడితే గో రక్షక దళాలని, ట్రిపుల్ తలాక్ అని, ఇలా పరిపరివిధాలుగా మొన్నటి
బాబ్రీ మసీదు కేసు వరకు రెచ్చగొట్టు ధోరణులతో చెలరేగిపోతుంది. దీని వల్ల నిజమైన
దేశ ఆర్ధిక సమస్యల నుండి జనాలను పక్కదారి పట్టించి జనాలను మతాల పేరిట రెచ్చగొట్టడం
వల్ల ఓట్లు రాలగోడుతుంది. దేశ ఆర్ధిక వ్యవస్థ రోజు రోజుకూ క్క్షీణించిపోతున్నా
బీజేపి తన ఓటు బ్యాంకును పదిలపరచుకునేది ఒక్క మత చందసవాదం పేరిట మాత్రమే. ఈ
విషయాన్ని ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఛానల్ ఇండియా టుడే జర్నలిస్టు రాజదీప్ సర్దేసాయ్
వివరిస్తూ బిజెపి ప్రభుత్వ నోట్ల రద్దు వ్యవహారం పై ఒక శీర్షిక కోసం ప్రజల
అభిప్రాయాలు సేకరిస్తున్నప్పుడు ఎక్కువగా వ్యతిరేకంగా ఉన్నారనీ, కొందరైతే తమ ఉపాధి
పోగొట్టుకున్నామని వాపోయారని ఆయన చెప్పారు. మరి రెండో సారి ఎన్నికల్లో ఎవరికీ ఓటు
వేసారని అడగగా షాక్ అయ్యానని చెప్తారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ప్రజలను ఏ విధంగా మతం,
కులం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటున్నారని. కాని రాజ్దీప్ గారు చివరగా CAA ను
ప్రస్తావిస్తూ ఈ ఆటలు ప్రజలు ఎల్లకాలం చూస్తూ వుండిపోరని తరువాత గట్టి గుణపాటం
చెప్తారని చెప్పారు.
నిజంగా భారత ముస్లిములు సీఏఏ గురించి భయపడక్కరలేదా?
మోడీ - షా ద్వయం ముస్లిములు ఆందోళన చెందనవసరలేదనే
మాట సుద్దా అబద్దం. కొత్త పౌరసత్వ సవరణ ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు అఫ్గానిస్తాన్లలో
మతపరమైన అణచివేత వల్ల 2014 కు ముందు వచ్చిన ముస్లిమేతర శరనార్ధులకు పౌరసత్వం
కల్పిస్తారు. ఇంతకు ముందు పౌరసత్వం ఇవ్వడానికి పదకొండు ఏళ్ళు భారత భూమిపై
నివాసముండాలి కాని కొత్త చట్టం దాన్ని అయిదు ఏళ్లకు కుదించారు.
మొదట రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన మతపర పౌరసత్వాన్ని లౌకికవాదులు, ప్రజాస్వామ్య వాదుల్లో
తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఒక లౌకిక దేశంలో ఏ భారతీయున్ని కుల, మత, ప్రాంత విద్వేషాలతో
ఎవరినీ కించపరచారాడు. ఈ చట్టం వల్ల భారత
ముస్లిములలో న్యూనతా భావాన్ ఏర్పడుతుందనేది కాదనలేని వాస్తవం.
మరి భారత ముస్లిములకు ఏంటి ముప్పు అనేది చూస్తే సీఏఏ కు
అనుబంధంగా వచ్చిన ఎన్ఆర్సీ ముందు ప్రతీ భారతీయుడు నిరూపించుకోవాల్సి ఉంటుంది. మొదట
ఇది అస్సాంలో పూర్తి చేసారు. ఈ ప్రాజెక్టునకు కోట్ల రూపాయలూ వెచ్చించారు. ఆ అస్సాం
ఎన్ఆర్సీ తరువాత 19 లక్షల మంది ఈ దేశ పౌరులు కాదని నిర్ధారించారు. అందులో 15 లక్షల
మంది ముస్లిమేతరులే కావున మరలా భారతీయ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు కాని
మిగతా వారు ముస్లిములైనందున చేసుకోలేరు. దేశ పౌరులు కాదని నిర్ధారించిన జాబితాలో
ఎన్నో ఏళ్ళు సైన్యంలో పనిచేసిన కుటుంబాలు కూడా ఉన్నాయి మరియు భారత మాజీ రాష్ట్రపతి
ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ కుటుంబీకులూ ఉన్నారని చెప్పడంతో మతం పేరుతో ఎంత
అన్యాయానికి ఓడిగాడుతున్నారో అర్ధమవుతుంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు ముస్లిముల అణచివేత
ఏ విధంగా జరుగుతుందో. అదే విధంగా ఈ చట్టం వల్ల లక్షల సంఖ్యలో బంగ్లాదేశ్ నుండి
హిందువులు రావడం వలన ఇక్కడ ప్రజల జనగణన మారి హిందూ రాష్ట్ర నినాదం బలపరచాలనే
బీజేపీ కుటిల నీతి బయటపడుతుంది.
మరి భారతీయులకు సీఏఏ పై సరైన అవగాహన
ఉందా?
లౌకికత్వం, భిన్నత్వం లో ఏకత్వం నా భారత దేశం అని ఊకదంపుడు ఉపన్యాసాలు
ఇచ్చే ప్రజాస్వామ్య ముసుగులో ఉన్న మనువాదులు ఇది భారత ప్రజల రక్షణకై అని పక్కదారి
పట్టిస్తున్నారు. దీని వల్ల మరో వేర్పాటువాదం పెచ్చుమీరే అవకాసం ఉందని ప్రజలు
తెలుసుకోవాలి. ఇకనైనా మేలుకోవాలి.
ఇటీవల జరిగిన సీఏఏ నిరసన సభలో అధిక సంఖ్యలో ముస్లిం సహోదరులు |
ఇటీవల జరిగిన సీఏఏ నిరసన సభలో అధిక సంఖ్యలో ముస్లిం మహిళలు |
ఈ మధ్య సీఏఏ కు వ్యతిరేకంగా
ఏర్పాటు చేసిన నిరసనా కార్యక్రమంలో పాల్గొన్న నేను అక్కడ నిరసనాకారుల్లో ముప్పావు
శాతం ముస్లిములను చూసి బాధపడ్డాను. దాని ద్వారా తెలిసింది ముస్లిం ప్రజలు ఏ విధంగా మానసిక ఆందోళనకు గురవుతున్నారో! భారత దేశం
దశాబ్దాలు వలసవాదుల చేతుల నుండి విముక్తురాలవ్వనిది ఎందుకని ప్రశ్న వేసుకుంటే చరిత్రకారులు భారతీయులలో ఐక్యత
లేకపోవడం అని చెప్తారు. అదే పరిస్థితి ఇప్పుడు మళ్ళి పునరావ్రుతమవుతుదనేది స్పష్టం
అవుతుంది. కావున ఇప్పటికైనా భారతీయులు తమ ఉన్నతమైన లౌకిక సిద్ధాంతం కాపాడుకోవాలని
నా మనవి!
మొదట వారు
కమ్యూనిస్టుల కోసం వచ్చారు
నేను
స్పందించలేదు.. కమ్యూనిస్టు కాను గనక
తరువాత
వారు యూదుల కోసం వచ్చారు
నేను మాట్లాడలేదు
.. యూదుణ్ణి కాను గనక
అటు తరువాత
వారు యూనియనిస్టుల కోసం వచ్చారు
నేను మారు
మాట్లాడలేదు .. యూనియనిస్టును కాను గనక
పిమ్మట
వారు కదోలిక్కుల కోసం వచ్చారు
నా
నోరు పెగలలేదు .. నేను ప్రొటెస్టెంటును గనక
చివరగా
నా కోసం వచ్చారు
ఇక
అప్పటికి నా కోసం మాట్లాడేవారే మిగాలలేదింకా!!!
-
మార్టిన్ నీ మొల్లర్
“జై
భీమ్”
0 Comments