*మనుస్మృతి దహన దివస్*
92 ఏళ్ళ క్రితం, ఈ రోజుల్లో... బహుజన ఆశాజ్యోతి డా|| బాబా సాహెబ్ అంబేడ్కర్ గారు చేప్పట్టిన మహాడ్ సత్యాగ్రహం విజృంభించి...దళితుల హక్కులకై గళం విప్పింది. ఇదే రోజు అనగా 1927 డిసెంబర్ 25వ తేదీన అంబేడ్కర్ గారు ఒక సభలో ప్రసంగిస్తూ "అసమానత్వంతో ఫరిడవిల్లుతూ, దళితుల రక్త మాంసాలు పీల్చుకు తినమనే బ్రహ్మణీయ భావజాలాన్ని నాశనం చేద్దాం. మతము, బానిసత్వము ఎప్పటికీ సమానము కాకూడదు." అని చెప్పారు.పిమ్మట ఆయన ఉద్యమంలో ఆయన సహవాసి, సహవాది బాపుసాహెబ్ సహస్త్రబుద్దే మాట్లాడుతూ "నేను బ్రహ్మణునిగా పుట్టినప్పటికీ, మనువాదాన్ని ఖండిస్తున్నాను. అది మతానికి పరిమాణ సూచిక కానే కాదు. అది అసమానతకు, బానిసత్వానికి, క్రూరత్వానికి, అన్యాయానికి పట్టుకొమ్మలు. కనుక దశాబ్దాల భారత బానిసత్వానికి కారణమైన ఈ మూర్ఖ మనుస్మృతిని దహించి వేయాలని సభాముఖంగా తీర్మానిస్తున్నాను." అని తన ప్రసంగాన్ని ముగించారు.
మనుస్మృతిని దహించివేయడం వల్ల ఓరిగే లాభమేంటి అని ప్రజల్లో ఒకరు ప్రశ్నించగా "గాంధీ గారు విదేశీ దుస్తులు దహించివేయడం వల్ల ఏమి సాధించారో అదే మనమూ సాధించాము. ఈ దహన ఒక నిరసన మార్గం" అని సమాధానమిచ్చారు.
ఆ దివ్యమైన రాత్రి 9 గంటలకు అంబేడ్కర్,సహవాది బాపుసాహెబ్ సహస్త్రబుద్దే మరియు ఆరుగురు దళిత సాధువుల చేతుల మీదుగా దహన కార్యక్రమం జరిగింది. ఆ దహించిన పిమ్మట ఖననం చేయగా అక్కడ 3 ప్లేకార్డులు ఉంచటం జరిగింది. ఆవేమిటంటే...
1. మనుస్మృతి శ్మశానము
2. అస్పృశ్యత నశించాలి
3. బ్రహ్మణీయ భావజాలాన్ని ఖననం చేయండి
అంబేడ్కర్ గారు ఏ ధ్యేయంతో మనుస్మృతిని దహనం చేసారో...అది సాధించామా? అంటే జవాబు ఖచ్చితంగా లేదు. ఎందుకనగా ఈ భావజాలం మరలా దాని విషపు కోరలు చాచి భారతావనిని అంధకారంలోకి నెడుతుంది. కావున మనుస్మృతి దహన దినాన్ని చారిత్రాత్మకంగా గుర్తుంచుకోవటమే కాక ఆ ధ్యేయానికైన అంబేడ్కర్ ఇచ్చిన పిలుపుకు కృత్కృత్యులవ్వాలి
- పిటి పార్కర్
0 Comments