వివేక వైరుధ్యము

వివేక వైరుధ్యము

రక్తమిచ్చిన సత్తువ
లేచి పొమ్మటుంది
జ్ఞానమిచ్చిన పుస్తకం
నడచి రమ్మంటుంది
ప్రాణమిచ్చిన వాయువు
విడిచి పొమ్మటుంది
వైనమిచ్చిన సిద్ధాంతం
వెన్ను తడుతోంది
దృష్టినిచ్చిన కళ్ళు
నీరసించిపోతుంది
ముక్తినిచ్చు అంతరాత్మ
పరుపెత్తుకు పదమంటుంది
నడినెత్తి సూర్యుడు
నడ్డి విరుస్తున్నాడు
నన్నేలు నైతికత
నినదించారా అంటుంది

- పిటి పార్కర్


Post a Comment

0 Comments