సరిగమలు - లుకలుకలు

సరిగమలు - లుకలుకలు


ఆనందాల కన్నీరు, వేదనల కన్నీరు
ఒకే కంటి నుండి వచ్చును

తిట్టడాలు, పొగడడాలు
ఒకే నోటి నుండి వచ్చును

ప్రేమ, ద్వేషం
ఒకే హృదయం నుండి వచ్చును

కరుణ, కాఠిన్యం
ఒకే మనసు నుండి వచ్చును

వెలుగు, చీకటి
ఒకే భూమండలం పై కలుగును

పరిమళించడం, కంపుకొట్టడం
ఒకే పువ్వు నుండి జరుగును

కరుణించడం, కాఠిన్యం చూపడం
ఒకే మనిషికీ కలుగును

ప్రపంచానికి ఈ ద్వంద్వ రీతి ఎంటో?
మనుష్యునికి ఈ ద్వంద్వ నీతి ఎంటో?

- పిటి పార్కర్


Post a Comment

0 Comments