అర్ధరహిత దేశభక్తి
భారత జాతీయ గీతం జనగణమన ప్రపంచంలో ఉత్తమ జాతీయ గీతంగా ఎంపికయ్యింది అని ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో విరివిగా దర్శనమిస్తుంది. నిజంగా అలాంటి ఒక విషయం జరగనప్పటికీ ప్రజలు దానిని విరివిగా అందరికీ పంపిస్తూనేవునారు ప్రజలు. ఈ మధ్యే నాకు ఆ పోస్టు పంపించారు. ఒక జాతీయ గీతం పై ఇంత మూడభక్తి ఎందుకు అనే ప్రశ్న నాలో తలెత్తింది. జాతీయ గీతం వినబడినప్పుడు ప్రజలలో ఎక్కడ లేని దేశభక్తి పొంగిపోరలుతుంది. ఎందుకంటే మాత్రం అది జాతీయ గీతం కనుక!!! తప్ప వేరే కారణం లేదు.
ఇది ముమ్మాటికీ మూడ భక్తే అని నా అభిప్రాయం. ఎందుకనగా జాతీయ గీతం యొక్క అర్దాన్ని ఈ భక్తులను అడగగా ఒక నవ్వు నవ్వి తెలియదు అని చెప్పేశారు ఈ గొప్ప దేశభక్తులు. మళ్ళి ఇదే దేశ భక్తులు జాతీయ గీతానికి ఎందుకు నిలబడటం లేదు అని నన్ను ప్రశ్నిస్తారు కూడానూ. ఈ అర్ధరహిత భక్తి దేశాన్ని ఎన్నో ఏళ్ళుగా నడిపిస్తూనే ఉంది. హేతువును వెన్నుపోటు పొడుస్తూనే వుంది.
మన జాతీయ గీతం మొదట 1911 కాంగ్రెస్ సదస్సులో పాడినప్పుడు అప్పటి ఆంగ్ల పత్రికలు టాగోర్ ఒక గీతాన్ని జార్జ్ 5 కు అంకితమిస్తూ పాడారని ప్రచురించిన మాట వాస్తవమే. గీతంలోని ఆ అధినాయకుడు జార్జ్ 5 అని అప్పుడు సంచలనం కొనసాగిందట. కాని చరిత్రకారులు దానికి వ్యతిరేకించారు. ఈ వివాదానికి పులిన్ బిహారీ సేన్ కు ఉత్తరం రాస్తూ టాగోర్ ఈ విధంగా అన్నారు.
“జార్జ్ రాకప్పుడు సత్కారానికి ఒక పాట రాయమని ఆయన అనుచరులు అడుగగా మొదట నాకు విచిత్రమనిపించింది. ఈ మానసిక ఆందోళనలో నేను భారత భాగ్య విధాతకు జేజేలు పలికాను. "కఠిన సమయము ఎగసి పడినప్పుడు" సంరక్షించిన ఆ అధినాయకుడు జార్జ్ ముమ్మాటికీ కాలేడు. అది నా మిత్రునికీ కూడా తెలుసు ” అని చెప్పారు.
కాని ఈ సమాధానం జార్జ్ మరణం తరువాత చెప్పారు. ఆయన బ్రతికున్నపుడు ఈ వివాదం పై టాగూర్ స్పందించలేదు. కానీ నెహ్రూ గారు జార్జ్ రాకకు ఒక ఐదు వచనాలు ఆయనను కీర్తిస్తూ టాగోర్ను రాయమన్నారని చాలా మంది వ్యాఖ్యానిస్తారు.
ఏదేమైనప్పటికీ ఈ విషయం పై విశ్లేషణ అప్రస్తుతం. ఆ అధినాయకుడు పై నుండి దీవెన లందించు భారత రధసారధి అనుకోవచ్చు. కానీ ఒక గీతానికి ఇంత మూడ భక్తి అనవసరం అని నా అభిప్రాయం. కానీ దీని అర్ధం తెలుసుకొనుట భారతీయులందరి బాధ్యత. మొదటి ఒక్క చరణO మాత్రమె మనము పాడుతూ వస్తున్నా మిగిలిన నాలుగు చరణాలు కూడా ఇప్పటి దేశ పరిస్థితులకు అత్యావస్యకము. ముఖ్యంగా గీతం అర్ధం చేసుకోటానికి మొత్తం అర్ధం చేసుకోవటం అవసరం.
మన జాతీయ గీతం గొప్ప గీతం అని ఎ సంస్థ ప్రకటించాల్సిన దుస్థితిలో లేదు అని చదివితే అర్ధమవుతుంది. గీతం ఆద్యంతం భావుకతతో నిండి భవిష్యత్తును నిర్దేశించి ధైర్యం నింపుతుంది. మొదటి చరణం భారత పవిత్ర నామమును కీర్తిస్తూ ఆ నాయకుని ఆశ్సిసులు కోరుతుంది. రెండవ చరణం ముఖ్యంగా ఇప్పుడు అవసరం ఎందుకనగా అది లౌకికత్వాన్ని పెంపోదిస్తుంది. మూడవ చరణం దైర్యాన్నిచ్చు అధినాయకుని కీర్తిస్తుంది. నాలుగవ చరణం దేశం విపరీత పరిస్థితులలో భారత మాట ప్రేమానురాగాన్ని కీర్తిస్తుంది. ఐదవ చరణం భారతావని మేల్కొంది అని ధైర్యాన్ని నింపుతుంది. దేశ ఉన్నతాన్ని చిత్రీకరించిన ఈ గొప్ప గీతం తెలుగు అనువాదం మీ కోసం ...
జనగణమన (తెలుగులో )
చరణం 1
Jano Gano
Mano Adhinayaka
Jaya Hey
Bharata Bhagya Bidhata,
Panjabo
Sindhu Gujarato Maratha
Drabiro
Utkala Bango
Bindhyo
Himachalo Jamuna Ganga
Uchhalo
Jalodhi Tarango
Tabo
Subho Namay Jagay
Tabo
Subho Ashiso Magay
Gahay
Tabo Jayagatha.
Jano Gano
Mangala Daayaka
Jaya Hey
Bharata Bhagya Bidhata
Jaya Hey,
Jaya Hey, Jaya Hey,
Jaya Jaya
Jaya Jaya Hey
మా మనస్సులను పాలించు నాయకుడా నీకు జయము
భారత గమ్యాన్ని అమలు చేయు అధినాయకుడా నీకు జయము జయము
పంజాబు, సింధు, గుజరాతు, మహారాష్త్ర, ద్రావిడ, ఒరిస్సా, బంగ్లా ప్రాంతాలు
గంభీర శిఖరములైన వింధ్య హిమాచలం పై నీ నామము ధైర్యానిస్తుంది
నీ పవిత్ర నామము యమునా గంగ ఐకమత్యముగా స్వరసంగమం అవుతుంది
మరియు వాటిని ఆకళింపు చేసుకున్న మహాసముద్రాల తరంగాలు నీ పవిత్ర నామస్మరణతో మేల్కొని నీ దీవెనలకై నిరీక్షిస్తుంది, నీ విజయమును కీర్తిస్తుంది
సంక్షేమాన్ని భారత భూమికి అందించు నాయకుడా నీకు జయము
భారత గమ్యాన్ని అమలు చేయు అధినాయకుడా నీకు జయము జయము
జయము నీకు జయము జయము
చరణం 2
Aharaha
Tabo Awhbano Pracharito
Shuni
Tabo Udaro Bani
Hindu
Bauddho Sikho Jaino
Parasiko
Musalmano Khristani
Puraba
Pashchimo Aashay
Tabo
Singhasano Pashay
Premoharo
Hawye Gantha
Jano Gano
Oikya Bidhyaka
Jaya Hey
Bharata Bhagya Bidhata
Jaya Hey,
Jaya Hey, Jaya Hey,
Jaya Jaya
Jaya, Jaya Hey
నీ పవిత్ర నామము ఇకమత్యానికి పిలుపునిస్తూనేవుంది
పగలు రాత్రి, హిందూ బౌద్ధులను, జైను సిక్కులను, పార్సీ ముస్లిములను మరియు
క్రైస్తవుల ఇక్యతకై నీ పిలుపు
తూర్పు నుండి పడమరకు నీ పవిత్ర నామముపై ఈ రాజ్యం విస్తరించి ఉంది
భిన్న సంస్కృతుల కలయికైన ఈ రాజ్య మాలను
ప్రేమతో నేయు బాధ్యత మాపై ఉంచినావు
ఈ భిన్నులమైన మా ప్రజలకు బంధాలు కలుగజేసిన నీకు జయము
భారత గమ్యాన్ని సంరక్షించు అధినాయకుడా
నీకు ఎల్లప్పుడూ జయము జయము
చరణం 3
Patana
Abhyudaya Bandhuro Pantha
Jugo Jugo
Dhabito Jatri
He Chiro
Sarathi, Tabo Ratha Chakre
Mukharito
Patha Dino Ratri
Daruna
Biplaba Majhay
Tabo
Shankha Dhwani Bajay
Sankata
Dukho Trata
Jano Gano
Patha Parichyaka
Jaya Hey
Bharata Bhagya Bidhata
Jaya Hey,
Jaya Hey, Jaya Hey,
Jaya Jaya
Jaya, Jaya Hey
కఠిన సమయము ఎగసి పడినా
నీ పుణ్యస్థల యాత్రీకులు వాటిని అడ్డగించారు
ఓ రధసారధి! నీ రధ చక్రాలు మమ్మును కాపాడుటకు
రేయి పగలూ ప్రతిధ్వనిస్తూనే ఉంది
నీ విజయ శంఖధ్వని యుద్ధ భీతిలో మమ్మును సంరక్షిస్తుంది
యత్రికుని స్థిరమైన స్నేహితుడా నీకు జయము
భారత విజయాల బాటకు సైనికుడా నీకు జయము జయము
భారత గమ్యాన్ని సంరక్షించు అధినాయకుడా
నీకు ఎల్లప్పుడూ జయము జయము
చరణం 4
Ghoro
Timiro Ghono Nibiro
Nishithay
Pirito Murchhito Deshay
Jagrata
Chhilo Tabo Abichalo Mangalo
Nato
Nayanay Animeshay
Duhswapnay
Atankay
Rakkha
Karilay Ankay
Snehamayee
Tumi Mata
Jano Gano
Dukho Trayaka
Jaya Hey
Bharata Bhagya Bidhata
Jaya Hey,
Jaya Hey, Jaya Hey,
Jaya Jaya
Jaya, Jaya Hey
రాత్రి విషాదపూరితమైనప్పుడు
ఈ భూమి అనారోగ్యంతో సోమ్మసిల్లినప్పుడు
ఓ భారతావని, నీ పవిత్ర ప్రేమతో మమ్మును చేరదీసి కాపాడావు
రాత్రి పీడకలలతో భయబ్రాంతులు చెందినప్పుడు
నీ ఒడిలో మమ్మును చేర్చి ధైర్యపరిచావు నీకు జయము
భయాలను పారద్రోలిన ఓ భరత మాత నీకు జయము జయము
చరణం 5
Ratri Prabhatilo Udilo Rabichhabi
Purbo Udaya Giri Bhalay
Gahay Bihangamo Punyo Samirano
Nabo Jibana Rasa Dhalay
Tabo Karunaruno Ragay
Nidrito Bharata Jagay
Jaya Jaya Jaya Hey, Jaya Rajeswara
Bharata Bhagya Bidhata
Jaya Hey, Jaya Hey, Jaya Hey,
Jaya Jaya Jaya, Jaya Hey
ఈ భయానక రాత్రి భారత భూమిని విడిచింది
తూర్పున సూర్యుడు ఉదయించినాడు
నీ పరితాపము వలన పక్షుల కిల కిల రావాలు, పవిత్ర సముద్రాల తరంగాలు
ఈ సరికొత్త జీవనానికి ఔషదమయ్యింది
భారతావని ఇప్పుడు మేల్కొంటుంది
సర్వశ్రేష్ట ధీరుడా నీకు జయము
భారత గమ్యాన్ని నిర్దేశించిన అధినాయకుడా
నీకు ఎల్లప్పుడూ జయము జయము
విశ్లేషణ మరియు అనువాదం
పిటి పార్కర్
0 Comments