స్వేచ్ఛా వాయువు కోసం నల్ల జాతీయుల ఉద్యమ హోరు మధ్యలో... నెట్టింట్లో తుపాకులకు ఎదురోడి నిలబడిన ఈ శాంతి స్వేచ్ఛా అను తుపాకులు ధరించిన ఈ వీర వనితను చూసి గగుర్పాటు వచ్చింది. ఆ స్వేచ్ఛావాది పై చిన్ని కవిత...
ఊపిరి
యుగాలుగా నీ జాత్యాభిమానం
అహంకార భూతమై మమ్మును ఊపిరాదనివ్వట్లేదు
తరాలుగా నీ తెల్ల తోలు తెంపరితనం
నా నల్ల నరుల స్వేచ్ఛను క్షౌరం చేసి ఊపిరాదనివ్వట్లేదు
ఏళ్లుగా నీ ఎర్ర రంగు ఎర్రితనం
నా జాతీయుల ఎదుగుదల పై మన్ను వేసి ఊపిరాదనివ్వట్లేదు
ఈ ఉక్కపోత నుంచి ఉద్యమ కెరటమై లేచాను
నీ ఉత్తుత్తి ఉక్కుపాదం ఉద్యమ ఊపిరిని ఆపలేదు!!!
- పిటి పార్కర్
0 Comments