ఎండమావి
ఇంటిముందు నడిరోడ్డుపై శవాన్ని చూస్తూ
ఉన్నారు బస్తీ వాసులు. పెంటయ్య సచ్చిపోయిండు. ఏడ్చి ఏడ్చి భార్య పిల్లల బట్టలు తడిచి
కళ్ళు ఎండిపోయాయి. గాలిబుగ్గలు అమ్మి పెంటయ్య, క్లిప్పులు, బూరలు, పక్కపిన్నీసులు అమ్మి
బాపమ్మ ఆరుగురు కూతుర్లను సాకుతున్నారు. ఇద్దరు కష్టపడినప్పుడే పిల్లలకి బడీ లేదు,
గుడీ లేదు. బడ్డీకొట్టు లాంటి ఆ ఇంటి బాడుగ రెండువందలు పోనూ రోజుకు రెండుసార్లు కారమో,పచ్చడో
పెట్టి పొట్ట పోసేవారు. పిల్లలు ఎండుపుల్లల్లా ఉన్నారు. నాన్న చనిపోయాడు అనే బాధ ఒకవైపైతే
రేపటి నుండి వారి పరిస్థితి ప్రశ్నర్ధకమే అని వారికీ తెలుసు.
నల్లమబ్బులు చంద్రుని కమ్ముతున్నాయి. చుక్కల
జాడేలేదు. మెల్లగా వర్షం మొదలయ్యింది. సోయలేని వారు చాలా సేపటికి గ్రహించారు. శవం తడిసిపోతుంది.
వర్షంతో ఉన్న బస్తీ వాసులు కూడా మాయమయ్యారు. బాపమ్మ శవాన్ని ఇంట్లోకి తీసుకెళ్లడానికి
సిద్ధమయ్యింది.
"ఆ శవాన్ని నా ఇంట్లోకి తీసుకెళ్లొద్దు"
అని ఇంటి యజమాని గట్టిగా అరిచాడు.
రెండు నెలలుగా బాడుగ కూడా కట్టట్లేదు పెంటయ్య.
ఎదురు సమాధానం చెప్తే ఏమవ్వుదో అని బాపమ్మ నోరు పెగలలేదు. లోపల నుండి దుఃఖం వస్తున్నా
కన్నీళ్లు రావట్లేదు. ఎం చేయాలో తెలియక తనకున్న చీర ఒకటి తీసుకొచ్చి శవానికి కప్పింది.
రాత్రంతా ఆ జల్లులోనే కూర్చున్నారు ఆ భార్యాబిడ్డలు. రేపు ఏమిటి అనే ప్రశ్న వారి మనసుల్లో
ఇంకా ఉంది. అంత్యక్రియలకు చేతిలో చిల్లిగవ్వలేదు. ఏడ్చిఏడ్చి నీరసించి పిల్లలు వర్షంలోనే
రోడ్డుపై నిద్రించారు. బాపమ్మకు అంతా అగమ్యగోచరంగా ఉంది.
తెల్లారింది. మెల్లగా శవం కంపు కొడుతుంది........
కొనసాగించడానికి సుకథ అప్ ను డౌన్లోడ్ చేసుకొండి
చదవడానికి క్రింది బటన్ ను నొక్కండి 👇
2 Comments
Its really very nice and content is very appriciable
ReplyDeleteThank you for that
ReplyDelete