చూపుడువేలు
ముత్యాల గర్భధారియైన సంద్రము
అలల తాకిడికి కలవరం చెందదా?
రత్నాలధారియైన సర్పము
మనుష్య అలజడికి గందరగోళపడదా?
పసిడి పండించు పంట చేలు
భూకంప ధాటికి భీతిల్లదా?
సిరులొలికించే పసిపాప హృదయంలో
విసుగు పుట్టించుట విడ్డూరమా?
సుధలను మోయు మధుపము
శాంతిని భగ్నపరచగా గాయపరచుట అసహజమా?
ఇన్ని విచారించు నేను
విమర్శించుట ఎటుల విడనాడేదను?
ఇది మూర్ఖమా... వితండమా...
వంచించు లేక విమర్శించు నిన్ను
విమర్శకుడు అందురా దంభాచారి అందురా?
- పిటి పార్కర్
0 Comments