సోయ లేని మీడియా - సరుకు లేని జనాలు
అందుకే రాశా... కాదు రాయాల్సొచ్చింది
సోషల్ మీడియా నిండా...
ఆలి మగల సొల్లు కబుర్లు,
ఆడవాళ్ళపై పంచాయతీలు
కనికట్టు కధలు
కుళ్లు చమత్కారాలు,
అసత్య ప్రచారాలు,
అసందర్భ ప్రేలాపణలు,
విపరీత పోకడలు,
వింత పురాణాలు,
హేతుకం లేని హిస్టరీలు,
మెదడు లేని మిస్టరీలు
ఆవేశపూరిత ఆక్షేపణలు,
నైతికం లేని నిక్షేపణలు
మానవత్వం లేని వాదనలు,
నిరంకుశత్వంతో నిండిన ఉపన్యాసాలు
కళ్ళు మూసుకునే కాఠిన్యాలు
ముక్కున వేలేసుకునే విషయాలు
నిర్లక్ష్యంతో కూడిన అరుపులు
చావులు, చిందులు, చట్టుబండలు
ఏమిరా?
నీ వల్ల దేశానికి ఉపయోగం???
#పిటి_పార్కర్
#unfaithfully_yours
0 Comments