Wednesday, 1 January 2020

ఇరవై - పదవోయ్

ఇరవై - పదవోయ్

2020లో నా మొదటి రచనతో
ఆశాజనకంగా అడుగిడుతున్నా
నూతన సంవత్సరంలో...


ఆజాదీ.. ఆజాదీ అని నినదిస్తూ
నూతన సంవత్సరాన్ని అడుగుతూ
స్వాగతం పలికారు లౌకికవాదులు!

కాపాడండి.. ఆపదండి అని మౌనంగా రోదిస్తూ
నూతన సంవత్సరాన్ని న్యాయం కోరుతూ
స్వాగతం పలికారు నా అక్కచెల్లెలు!

వేధించకండి.. బ్రతకనివ్వండి అని ఘోషిస్తూ
నూతన సంవత్సరాన్ని ప్రాథేహపడుతూ
స్వాగతం పలికారు దళిత కుసుమాలు!

ఆకలీ.. అసమానతా అని విలపిస్తూ
నూతన సంవత్సరాన్ని ఆహారం ఆర్థిస్తూ
స్వాగతం పలికారు పేద ప్రజలు!

గుర్తించండి.. అవకాశమివ్వండి అని ఆర్జిస్తూ
నూతన సంవత్సరాన్ని విద్యావకాశాలు కోరుతూ
స్వాగతం పలికారు హిజ్రాలు!

సవ్వాళ్ళు స్వాగతం పలుకుతున్న వేళ
ఆ గతం తరుముతున్న వేళ
నీ సమస్యలకు ఇస్తా సెలవోయ్
నేను చింత లేకుండా చూస్తా పదవోయ్
అంటూ ధైర్యమిస్తూ అడుగిడింది ఇరవై ఇరవై!

- పిటి పార్కర్.



Share:

0 comments:

Post a Comment