కాలుష్య క్రీడ
బోసి నవ్వుల బుడ్డీ
కాకరపువ్వొత్తి చించించే జిలుగులతో
మైమరచాడు పరవశంతో
కాంతి దేవత కన్నులవిందుని
కళ్లారా ఆరగిస్తున్నాడు
వాడికి తెలియదు
ఆ మెరిసే కాంతిదేవత వెనుక
దరహాసంతో తిరుగు కాలుష్యదేవత
దాని విషపు కోరలతో
వాడి యవ్వన్నాన్ని కబళించివేస్తుందని...
కసితో బుసగొట్టు ఆ కాలుష్యాదేవతను
మనసారా ఆహ్వానించు ప్రజలను చూసి
మైమరచింది వారి ప్రేమతో
తలయెత్తి తిరుగాడింది పట్టణమంతా
పట్టాభిషిక్తురాలైంది ఈ ధరణిలో
భూమాత తనువు చాలించింది
కాలుష్య మూకల అత్యాచారంతో
- పిటి పార్కర్. జె
0 Comments